'ఆర్ సి 15' నుంచి అదిరిపోయే అప్డేట్..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియాలోనే టాప్ దర్శకుడిగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న  శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ  రామ్ చరణ్ కి కెరియర్ పరంగా 15 వ సినిమా కావడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ ను జరుపుకుంటోంది. ఈ మూవీ లో కీయారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా , అంజలి , సునీల్ ఈ మూవీ లో ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీ లో లో దర్శకుడు మరియు నటుడు అయి నటువంటి ఎస్ జె సూర్య ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతునట్లు తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా షెడ్యూల్ ల షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో కార్మికుల సమ్మె కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన సినిమా షూటింగ్ లు అన్ని బందు అయిన విషయం మన అందరికి తెలిసిందే. అందులో భాగంగా ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం జరగడం లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా , ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ ని శంకర్ తన గత మూవీ ల మాదిరి గానే చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: