ప్రేమకథలు చేసి బోర్ ఫీలింగ్ వచ్చింది... నితిన్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే . ఈ మూవీ లో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించ బోతున్నాడు . ఈ మూవీ కి ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా , కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది .

మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా , ఈ మూవీ లో సముద్ర ఖని ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు . ఈ మూవీ ని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో పక్కా కమర్షియల్ మూవీ గా దర్శకుడు తెరకెక్కించాడు . ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు . ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ సభ్యులు వేసా ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ లో హీరోగా నటించిన నితిన్ కూడా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఈ ఇంటర్ వ్యూ లో భాగంగా నితిన్ మాచర్ల నియోజకవర్గం మూవీ కి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా నితిన్ మాట్లాడుతూ ...  20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. అందులో భాగంగా అనేక ప్రేమకథ మూవీ లు చేసి కొంత బోర్ ఫీలింగ్ వచ్చింది. డిఫరెంట్ మూవీ ని చేసి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అనే ఆలోచనతో మాచర్ల నియోజకవర్గం మూవీ చేశాను.  ఈ మూవీ ఫుల్ లెన్త్ కమర్షియల్ మూవీ. పవర్ఫుల్ రోల్,  అలాగే ఈ మూవీ లో పవర్ఫుల్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి అని తాజా ఇంటర్వ్యూలో నితిన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: