'బింబిసార 2' కథ ఇదే.. బాహుబలి2 ని మించేలా..?

Anilkumar
ఇటీవల కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార పార్ట్1 అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే.అయితే  కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇదిలావుంటే ఇక ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా బింబిసార1 ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇకపోతే  బింబిసార డైరెక్టర్ వశిష్ట, కళ్యాణ్ రామ్ బింబిసార2 కథ గురించి కూడా హింట్ ఇచ్చారు.కాగా బింబిసార పార్ట్1 లో రాజు బింబిసార గురించి ఎక్కువగా సన్నివేశాలు లేవు.

పోతే  బింబిసార రాజ్యాలను ఆక్రమించుకున్నాడని వెల్లడించినా ఆ సన్నివేశాలను తెరపై చూపించలేదు. అయితే ఇక  బింబిసార2 సినిమాలో మాత్రం ఆ సన్నివేశాలను దర్శకుడు చూపించనున్నారని తెలుస్తోంది.పోతే  బింబిసార ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు వశిష్ట, కళ్యాణ్ రామ్ ఈ విషయాలను వెల్లడించారు. ఇకపోతే మరోవైపు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా బింబిసార2 తెరకెక్కిస్తామని కళ్యాణ్ రామ్ అన్నారు.ఇక బింబిసార1 మూవీ తమకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిందని కళ్యాణ్ రామ్ వెల్లడించారు.కాగా  దర్శకుడు వశిష్ట ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా సినిమాలను తెరకెక్కించడం కూడా ఈ సినిమాల సక్సెస్ కు ఒక విధంగా కారణమని చెప్పవచ్చు.

అయితే  దర్శకుడు ఈ సినిమా విషయంలో ఒక విధంగా బాహుబలి2 సినిమాను ఫాలో అయ్యారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇక  బాహుబలి1 లో అమరేంద్ర బాహుబలికి సంబంధించిన సన్నివేశాలను ఎక్కువగా చూపించలేదు.అంతేకాదు దర్శకుడు వశిష్ట కూడా బింబిసార2 విషయంలో ఇదే లాజిక్ ను ఫాలో అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే బింబిసార2 సినిమాలోనే దర్శకుడు అసలు కథను చూపించనున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.కాగా  బింబిసార2 సినిమాతో కళ్యాణ్ రామ్ ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందేమో చూడాల్సి ఉంది. ఇక కళ్యాణ్ రామ్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయనే సంగతి తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: