ఈవీవీ బెడ్ రూమ్ సీన్స్ చెప్పగానే.. ఆమె బోరున ఏడ్చిందట తెలుసా?

praveen
ఇటీవలి కాలంలో సినిమాల్లో అయితే బెడ్రూమ్ లో నాలుగు గోడల మధ్య రహస్యంగా జరగాల్సినవన్నీ కెమెరాల ముందు చూపిస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నారూ అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే నేటి రోజుల్లో సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా హైలెట్గా మారుతున్నాయి. కానీ ఒకప్పుడు మాత్రం చిన్నపాటి రొమాంటిక్ సన్నివేశాలకు చేసేందుకు కూడా  ఎంతో మంది హీరోయిన్లు తెగ ఇబ్బంది పడి పోయేవారు. ఇటీవలి కాలంలో మాత్రం ఎంతోమంది నటీమణులు తమ పాత్రల విషయంలో పూర్తి క్లారిటీ గా ఉంటున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం స్టార్ డైరెక్టర్లు నటీనటులకు తమ పాత్రల గురించి పూర్తిగా వివరించేవారు కాదు.

 కేవలం హీరో హీరోయిన్ లకు మాత్రమే పాత్రల గురించి చెప్పి.. కేరక్టర్ ఆర్టిస్టులకు మాత్రం పాత్రల గురించి చెప్పేవారు కాదు. అయితే దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కూడా కొన్ని సినిమాల్లో ఇలా చేశారన్న టాక్ కూడా ఉంది. అయితే ఈవీవీ సత్యనారాయణ పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ఎవడి గోల వాడిది సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా కోసం బ్యాంకాక్ లో నెల రోజుల పాటు ప్రధాన నటీనటులతో కామెడీ నటులతో షెడ్యూల్ ప్లాన్ చేశారు. సినిమాలో తెలంగాణ శకుంతల కృష్ణ భగవాన్ కి భార్యగా ఒక ఫ్యాక్షనిస్టు గా నటించారు.

 అయితే బ్యాంకాక్లో వీరిద్దరి మధ్య ఒక రోజు హోటల్లో బెడ్రూం సీన్ ఉంటుంది. ఆ సీన్ గురించి ముందుగా ఇ.వి.వి.సత్యనారాయణ తెలంగాణ శకుంతలకు చెప్పలేదట. సరిగ్గా ఒక్క రోజు ముందు మాత్రమే పాత్ర వివరించారట. అయితే అప్పటికే ఆమె హీరోలకు అమ్మ అత్త క్యారెక్టర్ లో నటించారూ. ఈ వయసులో బెడ్రూం సీన్లలో చూపిస్తే కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో అని ఇక తెలంగాణ శకుంతల బోరున ఏడ్చేసిందట.  ఇక ఒకవేళ ఆ సీన్ చేయనని చెబితే షెడ్యూల్ మొత్తం  క్యాన్సిల్ అవుతుందని భయపడిందట. చివరికి ఈ విషయం ఈవీవీ చెప్పడంతో ఇక ఎక్కడా అసభ్యతకు తావులేకుండా బెడ్ రూమ్ సీన్ షూట్ చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Evv

సంబంధిత వార్తలు: