మరొక సూపర్ హిట్ సినిమాతో రాబోతున్న ఆహా ..!!

Divya
తెలుగు ఓటిటి సంస్థ అయిన ఆహా మొదటి నుంచి పలు మలయాళ సూపర్ హిట్ చిత్రాలను డబ్బింగ్ చేసి విడుదల విడుదల చేయడం ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ మధ్యలో ఆహ లో వరుసగా మలయాళం లో సూపర్ హిట్ అయిన సినిమాలు విడుదల కావడంతో యూజర్స్ బాగా పెరిగి పోయారు ఆహా కి. మలయాళం చిత్రాలు తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఓటీటి లో మాత్రం మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఆ కారణంగానే మరిన్ని మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు తీసుకురావడానికి ఓటిటి సంస్థలు ముందుకు రాబోతున్నాయి.

అలా మలయాళం లో స్టార్ హీరో అయిన ఫహద్ ఫాజిల్ నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా తెలుగులో ఏదో ఒక ఓటిటి ప్లాట్ఫారంలో విడుదలవుతూ ఉన్నది. ఆహా లో ఫహాద్ ఫాజిల్ సినిమాలకు సంబంధించి ఇప్పటివరకు చాలా సినిమాలే వచ్చాయి తాజాగా ఆయన గత ఏడాది నటించిన మాలిక్ అనే సినిమాను ఆహ లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. కరోనా ఇతర కారణాలవల్ల మాలిక్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదల అవ్వాల్సి వచ్చింది. అయినా కూడా ఈ సినిమాకు అక్కడ మంచి స్పందన లభించింది.
అయితే అమెజాన్ వద్ద కేవలం మలయాళం రైడ్స్ ఉన్నప్పటికీ తెలుగు రైట్స్ మాత్రం ఆహా దక్కించుకోవడం గమనార్హం. ఆహా లో మాలిక్ సినిమాను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. కాస్త ఎక్కువ ధరకే ఈ సినిమాను తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఆహా లో వచ్చే ప్రతి కంటెంట్ కూడా చాలా విభిన్నంగా ఉంటుంది.. అందుచేతనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ప్రస్తుతం ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమాను విడుదల చేస్తూ బాగా అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటుంది ఆహా సంస్థ. వచ్చే నెలలో ఆహా లో మాలిక్ సినిమా స్ట్రిమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: