సల్మాన్ తో కలిసి చిరు స్టెప్పులు వేయనున్నాడా!!

P.Nishanth Kumar
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సినిమా గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నయనతార కీలక పాత్రలో నటిస్తూ ఉండగా అతిధి పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తూ ఉండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా యొక్క షూటింగ్ దాదాపుగా పూర్తయిందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాలో బాలన్స్ గా ఉన్న రెండు పాటలను షూట్ చేసి ఈ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం దసరా కానుకగా రాబోతుందని అధికారికంగా ప్రకటించింది.

ఓ టీజర్ ను కూడా విడుదల చేసి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. సినిమా పై అంచనాలు పెరగడానికి ఈ టీజర్ ఎంతో ఉపయోగపడింది అని చెప్పొచ్చు. ఆచార్య సినిమా ఫ్లాప్ తో ఎన్నో ఇబ్బందులు పడుతున్న చిరంజీవి కి ఇప్పుడు ఈ సినిమా ఘన విజయం సాధించవలసిన అవసరం ఏర్పడింది. మలయాళ సినిమా లుసిఫార్ కి తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే బ్యాలన్స్ ఉన్న రెండు పాటలను షూట్ చేసి సినిమా కు గుమ్మడి కాయ కొట్టనున్న నేపథ్యంలో ఇందులో ఒక పాట సల్మాన్, చిరు ల మీద ఉండనుందట. 

సల్మాన్ ఖాన్ ఈ సినిమా లో నటించడం నిజంగా సినిమా కు మంచి హైప్ క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు. బాలీవుడ్ లో ఈ సినిమాకు దీనివల్లే మంచి హైప్ ఏర్పడింది. మరి ఈ పాటలో వీరిద్దరూ కలిసి వేసే స్టెప్పులు ఎంతటి స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాయో చూడాలి. తమన్ సంగీతం సమకూరుస్తుండగా  మెగా స్టెప్పులకే ఫిదా అయిపోయే మెగా అభిమానులకు ఇప్పుడు ఈ హీరో కూడా తోడవడం నిజంగా వేరే లెవెల్ క్రేజ్ సినిమాకు ఉంటుంది అని చెప్పొచ్చు. త్వరలోనే ఈ సినిమాకు సంభందించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి. మరి మెగా విజయం ఆయన అందుకుంటాడా అనేది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: