'ఓటిటి' విడుదల కోసం కొత్త రూల్స్ ను ప్రకటించిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్..!

Pulgam Srinivas
ప్రస్తుతం సినీ ప్రేమికులు 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లకు ఏ రేంజ్ లో అలవాటు పడిపోయారో మన అందరికీ తెలిసిందే. కరోనా కంటే ముందు మన దేశంలో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో సినిమాలను చూసే వారు చాలా తక్కువ మంది ఉండేవారు. కానీ ఎప్పుడైతే మన భారతదేశం లోకి ఎంటర్ అయిదో అప్పటి నుండి సినీ ప్రేమికులు 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో మూవీ లను చూడడానికి బాగా అలవాటు పడిపోయారు.

అలా సినీ ప్రేమికులు 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లకు బాగా అలవాటు పడిపోవడానికి ప్రధాన కారణం... కారోనా కేసులు తీవ్రంగా నమోదు అవుతుండటంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు థియేటర్ లపై కొంత కాలం పాటు కొన్ని ఆంక్షలను విధించడం , అలాగే కొన్ని రోజుల పాటు థియేటర్ లను పూర్తిగా మూసివేయడంతో సినీ ప్రేమికులకు 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లే ప్రధాన దిక్కుగా మారాయి. దానితో ఎంతో మంది సినీ ప్రేమికులు 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లకు బాగా అలవాటు పడిపోయారు. ఆ తర్వాత కారోనా తగ్గి సినిమా థియేటర్ లు యధాతధంగా నడుస్తున్నప్పటికీ ఎంతో మంది సినీ ప్రేమికులు సినిమాలను థియేటర్ లకి వెళ్ళి చూడడం కంటే 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడంతో థియేటర్ లలో మంచి సినిమా వచ్చినా కూడా కలెక్షన్లు రావడం లేదు.

దానితో తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సినిమా 'ఓ టి టి' విడుదలపై కొత్త రూల్స్ ను ప్రకటించింది.  వీటి ప్రకారం 6 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ గల సినిమాలు నాలుగు వారాల గ్యాప్ తర్వాత 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో విడుదల కానున్నట్లు ,  అలాగే భారీ బడ్జెట్ సినిమాలు 10 వరాల  గ్యాప్ తర్వాత 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో విడుదల కానున్నట్లు ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: