ఆ విషయంలో చిరంజీవి నిజంగా చాలా గ్రేట్..!

Anilkumar
సినిమా ఇండస్ట్రీలో స్టార్లు కావడం సులువైన విషయం కాదు. ఇక ఎంతో ప్రతిభను కలిగి ఉండటంతో పాటు ఆ ప్రతిభకు అదృష్టం తోడైతే మాత్రమే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ను సొంతం చేసుకోవడం సులువు అవుతుందనే సంగతి తెలిసిందే.అయితే చిరంజీవి ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. ఇక కొన్నేళ్ల క్రితం రాజకీయాలతో బిజీ అయిన చిరంజీవి ప్రస్తుతం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారు.ఇదిలావుంటే తాజాగా సీపీఐ నారాయణ హద్దులు దాటి మెగాస్టార్ చిరంజీవిపై విమర్శలు చేశారనే సంగతి తెలిసిందే. 

అయితే ఇక  ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో మెగా అభిమానుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడం గమనార్హం. 
కాగా చిరంజీవిపై నోరు పారేసుకోవడంతో నాగబాబు కూడా నారాయణపై ఒకింత ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఇకపోతే ఇష్టానుసారం నారాయణ మాట్లాడటంతో నెటిజన్లు సైతం నారాయణపై ఫైర్ అయ్యారు.ఇక తప్పు తెలుసుకున్న నారాయణ ఆ తప్పును సరిదిద్దుకున్నారు. భాషాదోషం వల్లే తాను అలా అన్నానని తాను అలా అన్న విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్, కాపునాడు మహానుభావులు నన్ను క్షమించాలని ఆయన కోరారు.

 అయితే ఇక  ఈ వ్యవహారం విషయంలో మెగాస్టార్ చిరంజీవి మాత్రం అస్సలు స్పందించకపోవడం గమనార్హం. ఇకపోతే పొగడ్తలను పొంగిపోకుండా విమర్శలకు స్పందించకుండా ఉన్న విషయంలో చిరంజీవి గ్రేట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పోతే అందరివాడు అనిపించుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి అనవసర విషయాలకు, వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండటం ద్వారా అభిమానులకు మరింత చేరువ అవుతున్నారు. అయితే ఒక్కో సినిమాకు చిరంజీవి 35 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తుండటం గమనార్హం. ఇదిలా వుండగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ఈ ఏడాదే థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: