రెండు తెలుగు రాష్ట్రాల్లో 'విక్రమ్' సినిమా టోటల్ కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
లోక నాయకుడు కమల్ హాసన్ 'విశ్వరూపం 2' సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని విక్రమ్ మూవీ తో వెండి తెరపై ప్రేక్షకులను పలకరించిన విషయం మనందరికీ తెలిసిందే. లోక నాయకుడు కమల్ హాసన్ చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా కావడం , వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్న లోకేష్ కనకరాజు విక్రమ్ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడం ,  విజయ్ సేతుపతి , ఫహాద్ ఫాజిల్ , సూర్య లాంటి హేమా హేమీలు అయిన నటీనటులు విక్రమ్ మూవీ లో నటించడంతో ఈ మూవీ పై మొదటి నుండే పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఆ అంచనాలకు తగినట్లు గానే విక్రమ్ సినిమా జూన్ 3 వ తేదీన భారీ అంచనాలతో విడుదల అయ్యింది. విక్రమ్ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ లు కూడా అదిరిపోయే రేంజ్ లో దక్కాయి.  ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 17.80 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేయగా,  31.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసి అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే విక్రమ్ సినిమా కొన్ని రోజుల నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న విక్రమ్ సినిమా ప్రస్తుతం 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: