ఈ వారం తెలుగు ప్రేక్షకులను థియేటర్లలో అలరించడానికి రెడీ అయిన సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రతి వారం ఏవో కొన్ని మూవీ లు థియేటర్ లలో విడుదల అవుతూ ఉంటాయి. అలాగే ఈ వారం కూడా కొన్ని మూవీ లు థియేటర్ లలో విడుదల కావడానికి రెడీ గా ఉన్నాయి. ఈ వారం థియేటర్ లలో విడుదల కాబోయే మూవీ లలో ఒక మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకోగా ,   ఒక చిన్న సినిమా మరియు ఒక డబ్బింగ్ మూవీ కూడా ఉన్నాయి.

అవి ఏమిటో తెలుసుకుందాం.
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన నాగ చైతన్య హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ మూవీ ఈ నెల 22 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా , ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.  ఈ వారం టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర రిలీజ్ కాబోయే మూవీ లలో ఈ మూవీ పైన సినీ ప్రేమికులు మంచి అంచనాలను పెట్టుకున్నారు. అనసూయ భరద్వాజ్ , సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన దర్జా సినిమా ఈ నెల 22 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.

హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన మహా సినిమా ఈ నెల 22 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు లో డబ్ అయ్యి విడుదల కానుంది. ఇలా ఈ వారం ఈ మూడు మూవీ లు తెలుగు సినీ ప్రేమికులను అలరించబోతున్నాయి.  మరి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే జూలై 22 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: