త్రివిక్రమ్ సినిమాకు అన్ని రోజులు మాత్రమే కేటాయించనున్న మహేష్ బాబు..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగస్ట్ నెల నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ను ఆగస్ట్ లో ప్రారంభించి 2023 సమ్మర్ కానుకగా ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది .

ఇక  ఆగస్ట్ నెల నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి రెడీ గా ఉండడంతో ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ ఫ్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ను కన్ఫామ్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ , మ్యూజిక్ డైరెక్టర్ గా తమను కూడా కన్ఫర్మ్ చేశాడు. ఈ మూవీ కి సంబంధించిన ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణులను కూడా ఫైనల్ చేసే పనిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఒక కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం కేవలం 100 రోజులు మాత్రమే కేటాయించనున్నట్లు, ఆ 100 రోజుల్లోనే తనకు సంబంధించిన సన్నివేశాలు అన్నింటినీ చిత్రీకరించుకోవాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సూచించినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. హారికా హాసిని క్రియేషన్స్ ఈ మూవీ ని నిర్మించబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న హైట్రిక్ సినిమా కావడంతో ఈ మూవీ పై మహేష్ బాబు అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: