'ది వారియర్' సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతో తెలుసా..?

Anilkumar
తాజాగా రామ్ పోతినేని హీరోగా ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది వారియర్'.అయితే  'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్ యాక్షన్ సినిమాలను మాత్రమే చేస్తున్నాడు.ఇకపోతే ఈ సారి కొంచెం స్టైలిష్‌గా ఖాకి యూనిఫార్మ్ వేసుకుని విలన్‌లను చిత్తు చేయడానికి సిద్ధమయ్యాడు.ఇక ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్‌లు, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేశాయి.అయితే  సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ చిత్రం జూలై 14న గ్రాండ్‌గా విడుదల కానుంది.

అయితే  ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్‌లను జోరుగా జరుపుతుంది.ఇక ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్‌ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. పోతే 2గంటల 35నిమిషాల రన్ టైంను మేకర్స్ లాక్ చేశారు. అయితే కృతి శెట్టీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.ఇదిలావుండగా  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు.అయితే  ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అంతేకాదు ఇప్పటికే విడుదలైన పాటలన్ని చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి.అయితే  ముఖ్యంగా బుల్లెట్ పాట మిలియన్‌ల వ్యూస్ సాధిస్తూ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

ఇక ఈ సినిమా కోసం రామ్ ఫాన్స్ ఎంతో ఎగ్జిటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా అనంతరం మాస్ దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో తన తదుపరిచిత్రాన్ని చేస్తున్నాడు రామ్. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను స్క్రిప్ట్ పనుల్లో కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ ప్రాజెక్టును బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాని కూడా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించబోతున్నారు.ఇక ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: