అల్లు అరవింద్ నిర్మాణంలో "777 చార్లీ" హీరో ?

VAMSI
ఈ మధ్య విడుదలైన చిన్న సినిమాలలో కల్లా అద్భుతమైన కలెక్షన్ లు అందుకుని బంపర్ హిట్ ను అందుకున్న సినిమా "777 చార్లీ". ఇందులో కన్నడ నటుడు రక్షిత్ శెట్టి  హీరోగా నటించాడు. చార్లీ గా ఒక కుక్క అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది. ఈ సినిమా ఒక్క కన్నడలోనే కాదు... తెలుగు, తమిళ్, హిందీ మరియు మలయాళం భాషలలో విడుదలైన మంచి పేరును పొందింది. కేవలం 20 కోట్ల తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి 100 కోట్ల వసూళ్లను దాటేసింది. ఇంకా థియేటర్ లలో రన్ అవుతుండడం విశేషం. ఈ సినిమా గురించి అన్ని  ఇండస్ట్రీలలో చర్చ జరుగుతోంది. డైరెక్టర్ కిరణ్ రాజ్ కు ఇప్పుడే ఆఫర్ లు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే తెలుగు సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటించిన రక్షిత్ శెట్టికి బంపర్ ఆఫర్ వచ్చిందట . ఈ సినిమా పట్ల ముగ్ధుడు అయిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొద్ది రోజుల క్రితం హీరోకు ఫోన్ చేసి, అభినందించాడట. అంతే కాకుండా త్వరలో గీతా ఆర్ట్స్ లో సినిమా చేద్దాం అంటూ ఆఫర్ ను ఇచ్చారట. అయితే వేరే భాషకు చెందిన హీరోకు ఇలా టాలీవూడ్ లో ఆఫర్ ఇవ్వడం అంటే మాములు విషయం కాదు. అయితే బాలీవూడ్ వెర్సస్ సౌత్ ఇండస్ట్రీ గా ఉన్న తరుణంలో... తాను కూడా సౌత్ ఇండస్ట్రీకి చెందిన హీరో కావడం వలనే అల్లు అరవింద్ ఈ ఆఫర్ ఇచ్చాడని భోగట్టా. అయితే ఇది ఇప్పటి వరకు ఉన్న గాసిప్ మాత్రమే అట .
మరి ఇది నిజం అవుతుందో ఏమో తెలియదు. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించే అల్లు అరవింద్ నిజంగా కన్నడ హీరోకు ఈ ఆఫర్ ఇవ్వాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: