తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో మరో మూవీ చేయనున్న సాయి ధరమ్ తేజ్..!

Pulgam Srinivas
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటి వరకు సాయి ధరమ్ తేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు .

ఇది ఇలా ఉంటే సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అనేక ప్రాజెక్ట్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నాడు .  సాయి ధరమ్ తేజ్ ము బాక్సాఫీస్ దగ్గర తనకు మంచి విజయాన్ని అందించిన దర్శకుడు తో మరో మూవీ చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . అసలు విషయం లోకి వెళితే... సాయి ధరమ్ తేజ్ , మారుతి కాంబినేషన్ లో ప్రతి రోజు పండగే సినిమా తెరకెక్కిన విషయం మన అందరికి తెలిసిం దే. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది . ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కి , మారుతి కి కూడా మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. ఇది ఇలా ఉంటే మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కబోతునట్లు తెలుస్తుం ది.

ఈ మధ్య పక్కా కమర్షియల్ మూవీ కి దర్శకత్వం వహించిన మారుతి మరి కొన్ని రోజుల్లో సాయి ధరమ్ తేజ్ తో ఒక మూవీ ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మారుతి ,  ప్రభాస్ తో కూడా ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యి ఉన్నాడు.  మరి మారుతి ముందుగా ప్రభాస్ తో మూవీ ని చేస్తాడో ...  సాయి ధరమ్ తేజ్ తో మూవీ ని మొదలు పెడతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: