అది కేవలం పూరి జగన్నాథ్ వల్లే అవుతుందంటున్న హీరో రామ్..!!

Divya
హీరో రామ్ కి ఈ మధ్యకాలంలో యూత్లో మంచి క్రేజీ లభించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కూడా కాస్త ఎక్కువగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా పేరుపొందారు. ముఖ్యంగా దేవదాసు చిత్రం కందిరీగ చిత్రం వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఆ తర్వాత మా సినిమాల వైపు కూడా ముగ్గు చూపి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. తాజాగా ది వారియర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మాస్ కంటెంట్ చేయాలని ఉద్దేశంతోనే తమిళ డైరెక్టర్ అయినా లింగు స్వామితో ఈ చిత్రం చేయడానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. కృతి శెట్టి కథానాయకిగా నటించడం జరిగింది. ఈ చిత్రం ఈ నెల 14వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్లలో చాలా జోరుగానే పాల్గొంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో హీరో రామ్ మాట్లాడుతూ మొదటి నుంచి తనకు పోలీస్ పాత్రలు అంటే చాలా ఇష్టమని పోలీస్ పాత్రలను పోషించాలని చాలా కోరికగా ఉండేది అని తెలిపారు. అందుకోసం పోలీస్ సినిమాలు గతంలో చాలానే చూశాను అని తెలిపారు. అయితే పోలీస్ పాత్ర కోసం ఏదైనా ఒక సినిమా చేయాలనుకున్నాను. కానీ ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల పోలీస్ కథలు విన్నాను కానీ డైరెక్టర్ లింగు స్వామి చెప్పిన పోలీస్ కదా తనకు నచ్చడంతో ఈ సినిమా యూనిఫామ్ లోనే ఒక పవర్ ఉందని అందువల్ల ఈ సినిమాను ఒప్పుకున్నారని తెలిపారు.

ఇస్మార్ట్ శంకర్ చిత్రంలాగే ఈ సినిమా కూడా తనకేరియర్లు మంచి సక్సెస్ నిలుస్తుందని భావిస్తున్నాడు హీరో రామ్. ఇస్మార్ట్ శంకర్ చిత్రం తన వల్లే హిట్ అయిందని పూరి జగన్నాథ్ ఎన్నోసార్లు చెప్పారు.. అది ఆయన గొప్పతనం.. కానీ అలాంటి సినిమాలు మాత్రం రాయాలి అంటే అది డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి సాధ్యమని తన అభిప్రాయంగా తెలిపారు. మళ్లీ ఆయనతో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: