జబర్దస్త్ లో కి కొత్త జడ్జి వచ్చారుగా...!!

murali krishna
సుదీర్ఘ కాలంగా ఈటీవీలో కొనసాగుతున్న జబర్దస్త్ ప్రోగ్రాంకి ఎంత క్రేజ్ ఉందొ ప్రేత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.


ఈ షో ద్వారా అనేకమంది కమెడియన్లు పుట్టుకు రావడంతో అందరినీ మేనేజ్ చేయలేక ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే మరో ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారట.. ఇక ఇటీవల ఈ ప్రోగ్రాంలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముందు నుంచి నాగబాబు రోజా ఈ కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరిస్తూ వచ్చేవారు.


నాగబాబు కొన్ని విభేదాలు కారణంగా ముందు జీ తెలుగుకి అటు నుంచి స్టార్ మా ఛానల్ కు వెళ్లి తనకు నచ్చిన కార్యక్రమం తాను చేసుకుంటున్నారట.మంత్రిగా పదవి రావడంతో రోజా కూడా ఈ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతానికి నాగేంద్రబాబు అలియాస్ మనో ఇంద్రజతో కలిసి ఈ కార్యక్రమాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే మనో సింగర్ కావడంతో ఆయనకు ఒక్కోసారి కుదరని నేపథ్యంలో పలువురిని తెర మీదకు తీసుకు వస్తున్నారట..

అలాగే లయ లాంటి కొంత మంది హీరోయిన్స్ ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు.


ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రాంలో జడ్జిగా మరో కొత్త సెలబ్రిటీ కూడా వచ్చేశారు. ఆ విషయం తాజాగా విడుదలైన ప్రోమోలో క్లారిటీ వచ్చింది. కొత్త జడ్జి ఎవరంటే సీనియర్ నటి బిజెపి నేత కుష్బూ. కార్యక్రమానికి జడ్జిగా వచ్చిన విషయం తెలుసుకున్న కంటెస్టెంట్లు ఆమెతో పులిహోర కలిపేందుకు ప్రయత్నాలు చేసి ఆమెను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట.. అందులో భాగంగానే మీరు ఇక్కడే ఉండిపోతా అంటే గుడి కట్టేందుకు సిద్ధమని రాంప్రసాద్ అంటే ఇప్పటివరకు కట్టలేదా అని కుష్బూ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారిందట.


తన చిన్న తంబి సినిమాని రీమేక్ చేస్తున్నానని బుల్లెట్ భాస్కర్ ఒక స్కిట్ చేసి చూపించగా ఇది రీమేకా లేక రీమిక్సా అంటూ ఆమె పంచ్ కూడా వేసింది. ఇక ప్రవీణ్ తో, రాంప్రసాద్ తో కూడా ఆమె సరదా సరదాగా చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో రోజాకి సరైన రీప్లేస్మెంట్ ఇన్నాళ్లకు దొరికింది అంటూ చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే ఒకపక్క నటిగా బిజీబిజీగా ఉండే కుష్బూ మరోపక్క బీజేపీ నేతగా రాజకీయం కూడా చేస్తున్నారు. మరి ఈ రెండిటిని మేనేజ్ చేసుకుంటూ ఆమె ఈ ప్రోగ్రాం కి హాజరు కాగలరా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: