ప్రభాస్, కొరటాల శివ.. అయ్యే పనేనా!!

P.Nishanth Kumar
కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన మిర్చి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కొరటాల శివ లాంటి ప్రతిభావంతులైన దర్శకుడు తెలుగు సినిమాలోకి పరిచయం చేసిన ఘనత కూడా ప్రభాస్ కే దక్కింది ఆ విధంగా వీరిద్దరి కలయికలో మళ్లీ ఒక సినిమా రావాలని వీరి వీరి అభిమానులు ఎంతగానో కోరుకోగా ప్రభాస్ మిర్చి సినిమా తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం మళ్ళీ వీరి కలయికలో సినిమా రాకపోవడానికి ప్రముఖ కారణం.

తాజాగా వీరి కలయిక లో మరో సినిమా రాబోతుంది అన్న వార్తలు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు సాధ్యం అనేది చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ నాలుగైదు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వచ్చే రెండు మూడు ఏళ్ల దాకా వేరే సినిమా ఒప్పుకోవడానికి లేదు ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడానికి తప్పకుండా రెండు సంవత్సరాలైనా పడుతుంది ఈ నేపథ్యంలో ఫుల్ బిజీగా ఉండే కొరటాల శివ అగ్ర దర్శకుడైన కొరటాల శివ ఈ చిత్రాన్ని చేయడం కోసం అన్ని రోజులు ఖాళీగా ఉంటాడా అనేది చూడాలి.

దానికి తోడు వరుస విజయాలతో ముందుకు దూసుకుపోయిన కొరటాల శివ గత సినిమా ఆచార్యతో వెనక్కి తగ్గాడు. తొలిసారి పరాజయం అందుకోవడంతో ఇప్పుడు ఎన్నో అనుమానాల మధ్య ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేస్తున్నాడు. ఇది విజయం సాధిస్తేనే భవిష్యత్తులో ఆయనకు పెద్ద హీరోల సినిమా అవకాశాలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై పూర్తి దృష్టి సారించిన కొరటాల శివ ఆ సినిమా తో ఎంతవరకు విజయాన్ని అందుకుంటాడు చూడాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితులలో కొరటాల శివ ప్రభాస్ తో సినిమా చేయడం అసంభవం అనే చెప్పాలి. మరి ఎన్టీఆర్ సినిమా హిట్ కొట్టిన తర్వాత కూడా కొన్ని రోజులు ఖాళీగా ఉంటే అప్పుడు ప్రభాస్ తో ఆయన సినిమా చేసే అవకాశం కలుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: