మేజర్ సినిమా మొత్తం కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
అడవి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన మేజర్ సినిమా జూన్ 3 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ కీలక పాత్రలలో నటించగా, ప్రకాష్ రాజ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా దర్శకుడు శశికిరణ్ తిక్క 'మేజర్' మూవీ ని తెరకెక్కించాడు.

మొదటి నుండి చిత్ర బృందం ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించాయి. అలాగే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్లు కూడా ఈ మూవీ కి బాక్సాఫీస్ దగ్గర దక్కాయి. ఇక పోతే ప్రస్తుతం ఈ సినిమా నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో జూలై 3 వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది. దానితో ఈ సినిమాకు ఇకపై కలెక్షన్ లు వచ్చే అవకాశం కూడా లేదు. ప్రపంచ వ్యాప్తంగా మేజర్ సినిమా మొత్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం.


నైజాం : 8.26 కోట్లు ,
సీడెడ్ : 1.95 కోట్లు ,
యూ ఎ : 2.29 కోట్లు ,
ఈస్ట్ : 1.43 కోట్లు ,
వెస్ట్ : 92 లక్షలు ,
గుంటూర్ : 1.18 కోట్లు ,
కృష్ణ : 1.13 కోట్లు ,
నెల్లూర్ : 69 లక్షలు .
మేజర్ సినిమా మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో  17.85 కోట్ల షేర్ , 29.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  2.15 కోట్లు .
హిందీ మరియు ఇతర భాషలలో :  7.05 కోట్లు .
ఓవర్ సీస్ లో : 6.30 కోట్లు .
మొత్తంగా మేజర్ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 33.35 కోట్ల షేర్ , 64.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: