రవితేజ కెరీర్లో బెస్ట్ సినిమా ఏదో తెలుసా?

Purushottham Vinay
ఇక ఈ మధ్య కాలంలో వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు సైతం నిర్మాతలకు కోటి రూపాయల నుంచి రూ.2 కోట్ల రేంజ్ లో లాభాలు అనేవి రావడం లేదు. అయితే దాదాపుగా 20 సంవత్సరాల క్రితమే టాలీవుడ్ సీనియర్ హీరో రవితేజ నటించిన ఇడియట్ సినిమా పెట్టుబడితో పోల్చి చూస్తే పది రెట్లు ఎక్కువగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.ఇక పూరీ జగన్నాథ్ పవన్ కళ్యాణ్,మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు ఈ సినిమా కథ చెప్పగా ఈ హీరోలిద్దరూ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.ఆ తర్వాత ఇక ఈ సినిమా కథ రవితేజ వద్దకు చేరగా రవితేజ ఈ సినిమాలో నటించడానికి వెంటనే అంగీకరించాడట. జగపతి బాబుతో తీసిన బాచి సినిమా ఫ్లాప్ కావడంతో ఆ సినిమా ఫ్లాప్ పూరీ జగన్నాథ్ కెరీర్ పై కొంతమేర ఎఫెక్ట్ చూపించింది. అయితే తెలుగులో బాచి ఫ్లాప్ అయినా తెలుగు సినిమాలను ఎక్కువగా చూసే కర్ణాటకలో ఈ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది. అయితే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఇంకా యువరాజా సినిమాలతో పూరీ జగన్నాథ్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు.ఇక పూరీ జగన్నాథ్ వైష్ణో అకాడమీ పేరుతో బ్యానర్ ను మొదలుపెట్టి ఇడియట్ సినిమాను తెరకెక్కించారు.


నెగిటివ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అసలు ఎంతగానో ఆకట్టుకుంది. చక్రి ఈ సినిమాకు సూపర్ మ్యూజిక్ అందించారు. హైదరాబాద్ లోనే ఈ సినిమా షూటింగ్ అంతా జరిగింది. ఇక ఈ సినిమాతోనే పూరీ జగన్నాథ్ కు బ్యాంకాక్ తో అనుబంధం అనేది ఏర్పడింది. హీరో పాత్ర కూడా యూత్ కు తెగ నచ్చేసింది.మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. 45 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అయితే ఎంతగానో ఆకట్టుకుంది. ఇంకా యూత్ కు కూడా ఈ సినిమా ఎంతగానో నచ్చింది. అలాగే ఇతర భాషల్లో రీమేక్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా సక్సెస్ తర్వాత రవితేజ కెరీర్ విషయంలో వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం స్టార్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇక ఇడియట్ సినిమా ఫుల్ రన్ లో మొత్తం రూ.20 కోట్ల కలెక్షన్లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: