'పక్కా కమర్షియల్' సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Anilkumar
డైరెక్టర్ మారుతీ కి ఒక స్టైల్ ఉంది.అది ఏంటంటే...ఒక సీరియస్ ఇష్యూ ని కూడా సరదా చెప్పడం డైరెక్టర్.అయితే గతంలో ప్రతి రోజు పండగే సినిమా హిట్ తర్వాత శోభన్ సంతోష్ హీరోగా చేసిన మంచిరోజులు వచ్చాయి మూవీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.ఇక అందుకే నెక్ట్ ప్రాజెక్ట్ కమర్షియల్ గా ఉండాలి అని పక్కా కమర్షియల్ అనే టైటిల్ పెట్టినట్టు ఆయన తెలిపారు.ఇక ఈ సినిమాలో  హీరో మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ రాశీఖన్నాతో సినిమా తీసాడు మారుతీ. ఇకపోతే అసలు విషయం ఏమిటంటే  ఈ సినిమాకు మొదటి హీరోగా మాస్ మహా రాజ్ రవితేజ ను అనుకున్నాడంటా మారుతీ.

కాగా  యూవీ క్రియేషన్స్, జీ2 పిక్చర్స్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నట్టు అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి.అయితే దీనికి లాయర్ సాబ్ అనే టైటిల్ ని కూడా అనుకున్నారంటా..అంతేకాకుండా  ఇక ఈ ప్రాజెక్ట్ వదులుకొని రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఖిలాడి లో నటించాడు.ఇక ఇదిలావుంటే అటు హిందీ, ఇటు తెలుగులోను పెద్దగా వసూళ్లు రాబట్టలేదు ఖిలాడి. రవితేజ మారుతీ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేయడానికి కారణం మాత్రం తెలీదు.పోతే  దీనిపై మారుతీ కానీ, రవితేజ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.ఇప్పుడు ప్రస్తుతం రవితేజ రామారావు ఆన్ డ్యూటీ విడుదలకు సిద్ధంగా ఉండగా, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో రవితేజ బిజీగా ఉన్నాడు.

 అయితే ఒక వైపు మారుతీ సినిమాలతో పాటు ఈ మధ్య 3 రోజెస్ అనే ఓ వెబ్ సిరీస్ కి రైటర్ గా కూడా చేసాడు. ఇకపోతే తర్వాత మారుతీ డార్లింగ్ ప్రభాస్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ప్రభాస్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను మారుతి పూర్తి చేశాడని, హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందనుందని, ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపించాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా అనుష్క హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు సమాచారం.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: