ఈ వారం థియేటర్ మరియు 'ఓటిటి' లో విడుదలకు రెడీ గా ఉన్న సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రతివారం లాగానే ఈ వారం కొన్ని సినిమాలు థియేటర్ లలో విడుదల కానుండగా మరి కొన్ని సినిమాలు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అలా ఈ వారం థియేటర్ మరియు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో విడుదల కాబోయే సినిమాల గురించి తెలుసుకుందాం.
ఈ వారం థియేటర్ లలో సందడి కాబోయే మొవీల..
పక్కా కమర్షియల్ : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ ఇమేజ్ కలిగిన హీరోలలో ఒకరైన గోపీచంద్ హీరోగా అందాల ముద్దుగుమ్మ రాశి కన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా జూలై 1 వ తేదీన  విడుదల కాబోతుంది.
రాకెట్రీ : ఆర్ మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రాకెట్రీ మూవీ జులై 1 వ తేదీన  విడుదల కాబోతుంది.
టెన్త్ క్లాస్ డైరీస్ : శ్రీకాంత్ , అవికా గోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన టెన్త్ క్లాస్ డైరీస్ మూవీ జూలై 1 వ తేదీన  విడుదల కాబోతుంది.
 ఈ వారం 'ఓ టి టి'  ఫ్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ కావడానికి రేడీ గా ఉన్న సినిమాలు ఇవే..
ఆహా : రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన హర్రర్ మూవీ అన్యస్ ట్యుటోరియల్ (తెలుగు) జూలై 1 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' సంస్థల్లో ఒకటైన ఆహా 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కావడానికి రేడీ గా ఉంది.
విరాట పర్వం : రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ప్రియమణి కీలక పాత్రలో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాట పర్వం సినిమా జూలై 1 వ తేదీ నుండి నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కావడానికి రేడీ గా ఉంది.
సామ్రాట్ పృథ్వీరాజ్ : అక్షయ్ కుమార్ , మనుషా చిల్లర్ హీరో హీరోయిన్ గా  తెరకెక్కిన సామ్రాట్ సినిమా జూలై 1 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: