పక్కా కమర్షియల్ ట్రైలర్ 2.. మారుతి నువ్వు సూపరంతే..!

shami
సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి.. మ్యాచో స్టార్ గోపీచంద్ కలిసి చేసిన సినిమా పక్కా కమర్షియల్. గోపీచంద్ కెరియర్ లో రిలీజ్ ముందు సూపర్ పాజిటివ్ బజ్ తో వస్తున్న సినిమా ఇదే అని చెప్పొచ్చు. మారుతి మార్క్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కథ రొటీనే అయినా స్క్రీన్ ప్లే మారుతి మార్క్ ఉంటుందట. ఇప్పటికే పక్కా కమర్షియల్ ట్రైలర్ 1 సినిమా పక్కా ఎంటర్టైన్ మెంట్ అనిపించగా రిలీజ్ మరో రెండు రోజులు ఉందనగా లేటెస్ట్ గా సినిమా నుంచి మరో ట్రైలర్ రిలీజ్ చేశారు.
పక్కా కమర్షియల్ సినిమా సెకండ్ ట్రైలర్ ఈ సినిమాలో కామెడీనే కాదు గోపీచంద్ ఫ్యాన్స్ కోరుకునే ఫైట్స్ కూడా ఉన్నాయని తెలియచెప్పేలా ఉంది. స్టైలిష్ యాక్షన్ సీన్స్ లో గోపీచంద్ అదరగొట్టాడు. గోపీచంద్, రాశి ఖన్నాల మధ్య సీన్స్ కూడా ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయని అనిపిస్తుంది. పక్కా కమర్షియల్ సినిమాని గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ కలిసి నిర్మించారు. ఈ సినిమా కథ అంత గొప్పగా లేకున్నా కథనం మాత్రం మారుతి మార్క్ కనిపించేలా తన సత్తా చాటుతుందని అంటున్నారు.
పక్కా కమర్షియల్ సెకండ్ ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది. ఆడియెన్స్ పల్స్ బాగా తెలిసిన మారుతి ఈ మూవీని మాస్ క్లాస్ ఆడియెన్స్ అందరు మెచ్చేలా తెరకెక్కించాడు. తప్పకుండా పక్కా కమర్షియల్ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అవుతుందని అంటున్నారు. ఈమధ్య ఓటీటీల వల్ల థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసే ఆడియెన్స్ సంఖ్య తగ్గింది. అయితే పక్కా కమర్షియల్ ఎంటర్టైన్ మెంట్ కోరుకునే వారు తప్పకుండా చూసేలా ఉంటుందని చెబుతున్నారు. మరి ఆశించిన స్థాయిలో పక్కా కమర్షియల్ హిట్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: