స్పీడ్ పెంచిన ఉస్తాద్ హీరో.. మరో స్టార్ డైరెక్టర్ కి రామ్ గ్రీన్ సిగ్నల్..!

Anilkumar
ఎనర్జిటిక్ స్టార్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ప్రస్తుతం రామ్  స్పీడ్ పెంచాడు.. బేక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు ఈ కుర్ర హీరో.ఇకపోతే  ప్రస్తుతం రామ్ పోతినేని తమిళ్ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇదిలావుంటే ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ్ లోనూ విడుదల కానుంది.ఇక  ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. 

ఇదిలావుంటే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో సినిమా చేస్తున్నాడు రామ్. కాగా ఇప్పటికే ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.పోతే  రామ్ కోసం ఓ పవర్ఫుల్ స్టోరీని రెడీ చేశారట త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది.అంతేకాకుండా రామ్ సోలో హీరోగా నటిస్తున్న మూవీ కాదని తమిళ క్రేజీ హీరో శివ కార్తీకేయన్ కూడా ఇందులో నటిస్తున్నారని టాక్ దాంతో ఇది మల్టీస్టారర్ గా తెరకెక్కించబోతున్నారని అర్ధమవుతోంది. ఇక అంతే కాకుండా ఈ మూవీలో హీరో రామ్ నటసింహం నందమూరి బాలకృష్ణ డైహార్డ్ ఫ్యాన్ గా కనిపించబోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ మరో స్టార్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో రామ్ సినిమా చేయనున్నారని టాక్. ఇకపోతే ఇటీవలే హరీష్ శంకర్ రామ్ ను కలిసి కథ వినిపించారని, కథ బాగా నచ్చేసిందని చెబుతున్నారు. అయితే బోయపాటి సినిమా తర్వాత రామ్ నటించే మూవీ ఇదే అని అంటున్నారు. ఇకపోతే మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: