హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. బాధ్యతంతా ఆ డైరెక్టర్ పైనే..?

Anilkumar
టాలీవుడ్  సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా..ఎంతో కష్టపడి తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో మాస్ మహారాజా రవితేజ.అయితే ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని హీరోగా కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఇక హీరో మాస్ మహారాజా రవితేజ మూవీస్ థియేటర్లోకి వచ్చాయంటే ప్రతి ఒక్కరూ కడుపుబ్బ నవ్వుతూ ఎంజాయ్ చేయాల్సిందే.ఇకపోతే రవితేజ తరువాత అతని తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడని చాలా కాలంగా టాక్ నడుస్తోంది. అయితే కాని దానిపై క్లారిటీ లేదు.ఇక అంతకంటే ముందు రవితేజ తమ్ముని కొడుకు మాధవన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

ఇకపోతే  ఇతన్నీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి.పోతే  కాని సరైన టైమ్ దొరకలేదు. ముఖ్యంగా లాక్ డౌన్ టైమ్ వల్ల.. చాలా వరకూ వేస్ట్ అవ్వడంతో లేట్ గా.. ఇండస్ట్రీకి ఇంటర్డ్యూస్ అవుతున్నాడు మాధవన్.అయితే రమేష్ వర్మ డైరెక్షర్ గా మాధవన్ హీరోగా క్రేజీ కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక గతంలో రవితేజతో రెండు సినిమాలు చేసిన రమేష్ వర్మ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయినా కూడా  రవితేజ అతని టాలెంట్ ను చూసి తన తమ్ముడి కొడుకుతో ఎలాగైనా సినిమా తీసి హిట్ కోట్టించాలని చూస్తున్నారు.

 ఇక దీంతో రమేష్ వర్మ పై పూర్తి బాధ్యతలు పెట్టారని తెలుస్తోంది. పోతే  ఈ సినిమాను రమేష్ వర్మనే డైరెక్ట్ చేస్తాడ లేదా ఇంకెవరనేది ఇప్పటివరకు తెలియలేదు.అయితే  మరి మాధవన్ అయినా హిట్ కొడతాడో లేదో అనేది మనం చూడాలి.గతంలో.. హీరో రవితేజ రమేష్ వర్మ కాంబినేషన్ లో 2011లో వీర మూవీ వచ్చింది. కాగా ఈ మూవీ బాక్సాపీస్ వద్ద అంతగా వసూలు చేయలేదు.ఇక  ఈ మూవీ తర్వాత 8 సంవత్సరాల వరకు రమేష్ కి చెప్పుకోదగ్గ మూవీస్ ఏమీ రాలేదు. అయితే తర్వాత రీమేక్ మూవీతో రమేష్ వర్మ కాంబినేషన్ లో రవితేజ మళ్లీ స్క్రీన్ పైకి వచ్చారు.ఇదిలావుంటే  రవితేజతో 2021లో కిలాడీ సినిమా చేశారు.ఇక  దీంతో రవితేజ ఖాతాలో మరొక ఫ్లాప్ వచ్చి పడింది. అయితే ఎక్కువ బడ్జెట్ తో తీసినా బాక్సాపీస్ వద్ద అనుకున్నంత వసూళ్లు మాత్రం చేయలేదు అని చెప్పవచ్చు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: