సూర్య చేతుల మీదగా విడుదలకానున్న 'ది వారియర్' సినిమా సాంగ్..!

Pulgam Srinivas
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ది వారియర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు తమిళ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న లింగు స్వామి దర్శకత్వం వహిస్తున్నాడు.
 

ఈ సినిమాలో రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే మూవీ నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేయగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇప్పటికే ఈ సినిమా నుండే చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేయగా, ఆ పాటలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన బుల్లెట్ సాంగ్ కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది.  బుల్లెట్ సాంగ్ కి తెలుగు మరియు తమిళ భాషలలో మంచి ఆదరణను దక్కుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి విజిల్ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ది వారియర్ సినిమా లోని విజిల్ సాంగ్ ను తమిళ స్టార్ హీరోలలో ఒకరు ఆయన సూర్య చేతుల మీదగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.

విజిల్ సాంగ్ ను సూర్య చేతుల మీదగా సాయంత్రం 7 గంటల 12 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని జూలై 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ తో రామ్ పోతినేని ఎలాంటి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర ఎందుకు ఉంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: