రాశీ ఖన్నా 8 ఏళ్ళ సినీ కెరియర్ ఇదే..!!

Divya
మద్రాస్ కేఫ్ అనే హిందీ చిత్రంతో మొదటిసారిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది రాశి ఖన్నా. మనం మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తన తొలి చిత్రంతోనే ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నది ఈ క్రమంలో వరుస అవకాశాలు అందించుకుంటూ అతి తక్కువ సమయంలో క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించింది. రాశీ ఖన్నా మొదటి సినిమా సక్సెస్ అయినప్పుడు ఆ వెంటనే వచ్చిన చిత్రం జోరు.

ఈ చిత్రం నిరాశ పరిచిన ఆ తరువాత శివమ్, జిల్, బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవకుశ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ఇదే క్రమంలోనే మలయాళంలో కూడా పలు చిత్రాలలో అవకాశాలను అందుకొని మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. గతంలో కాస్త బొద్దుగా ఉన్న ఈమె ఆ తర్వాత రోజుల్లో నాజుగ్గా తయారయింది. తెలుగులో ఆక్సిజన్, టచ్ చేసి చూడు, శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాలు ఈమెను నిరాశ పరిచాయి. వెంకీ మామ, తొలిప్రేమ, ప్రతి రోజు పండగే వంటి చిత్రాలు మంచి విజయాలను చేకూర్చాయి.

అయితే ఎన్నో ఆశలు పెట్టుకొని వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించిన అది ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో అమే కేవలం తమిళ చిత్రాలకే పరిమితం కావాల్సి వచ్చింది కానీ ఇప్పుడు తాజాగా మళ్లీ తెలుగులో 2 బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేయడానికి సిద్ధమైంది. అందులో నాగచైతన్యతో థాంక్యూ సినిమా లో నటించింది. ఈ చిత్రం జూలై నెలలో విడుదల కాబోతోంది. ఇక మరొకటి పక్కా కమర్షియల్ సినిమా ఈ చిత్రం కూడా జులై మొదటి వారంలో విడుదల అవుతోంది. పడుకో ఇక రాశి కన్నా 2014వ సంవత్సరంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: