మారుతి కి మరో ఆప్షన్.. ప్రభాస్ కాదంటే..!!

P.Nishanth Kumar
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియ ల్ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఆయన చేసిన ప్రతి రోజు పండగే సినిమా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకోగా ఆ తర్వాత ఆ యన చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి రవితేజతో కలిసి ఆయన తదుపరి సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు కానీ అది కుదర లేదు. రమణ దేశం కారణంగా ఆ చిత్రం రవితేజ చేయడానికి ఒప్పుకోలేదు.

ఇప్పుడు అదే కథ తో గోపీచంద్ హీరోగా ఈ సినిమా చేస్తున్నా డు. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తూ ఉండగా వీరిద్దరూ కూడా లాయరుగా ఈ చిత్రంలో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడు దలయ్యాయి. ఇవి ప్రేక్షకులలో మంచి అంచనాలను ఏర్పరిచింది. గోపీచంద్ కూడా సరైన విజయం దక్కి చాలా రోజులు అయిపోతున్న నేపథ్యంలో ఈ సినిమా తప్పకుండా ఆయనకు మంచి విజయాన్ని తెచ్చి పెడుతుంది అని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమా తర్వాత మారుతి ప్రభాస్ తో కలిసి ఓ సినిమా చేస్తు న్నాడనే వార్తలు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తో ఉండగా మరికొంతమంది మారుతి ప్రభాస్ తో సినిమా చేయడం లేదు అనే వార్తలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సిని మాపై ఎవరు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వారు ఈ కాంబినేషన్లో సినిమా గురించి అనుకుంటున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రభాస్ తో చేయటం కుదరకపోతే నాని తో చేయడానికి సిద్ధం అవుతానని అని చెప్పాడట ప్రస్తుతం కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై ఒకటవ తేదీన ఈ సినిమా యొక్క విడుదల జరగనుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: