'పొన్నియన్ సెల్వన్ 1' టీజర్ విడుదల అయ్యేది అప్పుడే..!

Pulgam Srinivas
భారతీయ చలన చిత్రం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయిన మణిరత్నం ప్రస్తుతం 'పొన్నియన్ సెల్వన్' అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ ని మణిరత్నం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు .

తొలి భాగాన్ని సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది . ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ని లైకా ప్రొడక్షన్స్ , మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి .  ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్ లను వేగవంతం చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ టీజర్ ను ముందుగా విడుదల చేయాలని చిత్ర బృందం అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది .

అందులో భాగంగా జులై మొదటి వారంలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేయాలని చిత్ర బృందం ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో చియాన్ విక్రమ్ , జయం రవి , కార్తి , జయరాం , ప్రకాష్ రాజ్ , ప్రభు , ఐశ్వర్య రాయ్ ,  త్రిష , శరత్ కుమార్, పార్తీబన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: