ఆ రచయిత నుండి 5 కథలను కొనేసిన రవితేజ..?

Anilkumar
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ  ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.అయితే  రవితేజ కరోనా లాక్ డౌన్ తరువాత క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.కాగా  క్రాక్ సినిమా తరువాత ఖిలాడీ సినిమా విడుదల అయినప్పటికీ ఆ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది.ఇకపోతే  రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద గా తీవ్ర నిరాశ పరిచింది.ఇక  ప్రస్తుతం ఇప్పుడు  రవితేజ తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే రవితేజ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఇక ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అని రవితేజ నమ్మకంతో ఉన్నారు. అంతేకాదు అలాగే ఈ సినిమా తర్వాత తెరకెక్కబోయే ధమాకా సినిమా కూడా మంచి హిట్ సాధిస్తుంది అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.ఇక  ఇదిలాఉంటే ఇటీవలే రవితేజ ఒక టాలెంటెడ్ రైటర్ నుంచి ఏకంగా ఐదు కథలను ఒకేసారి కొనేసినట్లుగా తెలుస్తోంది.అయితే  ఆ కాన్సెప్టులు అన్నీ కూడా బాగా నచ్చడంతో రవితేజ మరో ఆలోచన లేకుండా రచయితకి మొత్తంగా భారీ అమౌంట్ నే నచ్చజెప్పి ఆ అయిదు కథలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక మరి ఆ రైటర్ ఎవరో కాదు శ్రీకాంత్.ఇకపోతే ఖిలాడి సినిమాకు రైటర్ గా పని చేశాడు శ్రీకాంత్.

కాగా దర్శకుడు రమేష్ వర్మ తో రవితేజకు విభేదాలు వచ్చినప్పటికీ సినిమా రిలీజ్ ఈవెంట్ షో రవితేజ దర్శకుడి గురించి మాట్లాడకుండా పూర్తిగా రచయిత గురించి పాజిటివ్ గా స్పందించడం విశేషం. ఇక అతని కారణంగా సినిమా బాగా వచ్చిందని భవిష్యత్తులో కూడా ఆ రచయిత తన భవిష్యత్తు ప్రాజెక్టుల ఈ విషయంలో కూడా కొనసాగుతాడు అని రవితేజ తెలియజేశాడు. అయితే అప్పట్లో రవితేజ అన్నట్టుగానే ఆ రచయితకు ఒక మంచి అమౌంట్ ఇచ్చి అతని దగ్గర ఉన్న ఐదు కథలను ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఆ రచయిత ఆ ప్రాజెక్టుల స్క్రిప్ట్ డెవలప్ వర్క్స్ లో పని చేసి మరింత ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉందని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: