ఆ చిన్న తప్పు వల్ల 9 సినిమాలు మిస్ చేసుకున్న శ్రీరామ్..?

Anilkumar
తెలుగులో తక్కువ సినిమాలు చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు హీరో శ్రీరామ్.అయితే ఈయన తెలుగులోనే కాకుండా తమిళంలో శ్రీకాంత్ గా ఫేమస్ అయిన ఈ నటుడు తెలుగులో శ్రీకాంత్ పేరుతో ఇప్పటికే పాపులర్ హీరో ఉండటంతో శ్రీరామ్ గా ఫేమస్ అయ్యారు.అయితే ఈయన గతం లో ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పోలీస్ పోలీస్, దడ, నిప్పు సినిమాల ద్వారా శ్రీరామ్ క్రేజ్ ను పెంచుకున్నారు.ఇదిలావుండగా ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రీరామ్ మాట్లాడుతూ తాను 17 సంవత్సరాల నుంచి ఒకే ఫోన్ నంబర్ ను వాడుతున్నానని అన్నారు.

అంతేకాదు  టెన్త్ క్లాస్ డైరీస్ సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ఇక కథను నమ్ముకుని నిర్మాత ఈ సినిమాను నిర్మించారని ఆయన వెల్లడించారు. అంతేకాక క్వాలిటీ సినిమాను తెరకెక్కిస్తే ప్రేక్షకులు సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేస్తారని శ్రీరామ్ చెప్పుకొచ్చారు.ఇకపోతే లైఫ్ లో అన్నీ చెయ్యాలని అందువల్లే తాను హర్రర్ సినిమాలు చేశానని ఆయన వెల్లడించారు.కాగా  కథ నచ్చి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామని షూట్ సమయంలో సినిమా రిజల్ట్ తెలిసినా యాక్ట్ చేయక తప్పదని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే హర్రర్ జానర్ మంచి జానర్ అని ఆయన తెలిపారు.కాగా  మనం చేసిన తప్పులను యాక్సెప్ట్ చేయాలని ఆయన వెల్లడించారు.

ఇక  తాను డైరెక్టర్ ఆర్టిస్ట్ అని ఆయన కామెంట్లు చేశారు.అయితే స్నేహితులు సినిమాలోని సీన్లను సింగిల్ టేక్ లో పూర్తి చేశానని ఆయన తెలిపారు.  అంతేకాకుండా ఈయన లై, దడ సినిమాల కథలు అద్భుతంగా ఉన్నా ప్రేక్షకులకు నచ్చలేదని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే పోలీస్ పోలీస్ సినిమా నాకెంతో ఇష్టమని విజయ్ తో కలిసి మళ్లీ సినిమా చేయాలని ఆయన అన్నారు.అయితే  నేను నాగార్జునకు ఫ్యాన్ అని ఆయన తెలిపారు. ఇక 2003 సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన సాయంత్రం సాంగ్ సీక్వెన్స్ సమయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ఆ ఘటన వల్ల తాను 9 సినిమాలు మిస్ అయ్యానని ఆయన అన్నారు.కాగా  ఈ ఘటన జరగడానికి తానే కారణమని ఆయన చెప్పుకొచ్చారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: