బాలీవుడ్ లో ఈ ఘోరాలు జరగడం నిజమేనా ??

VAMSI
ఏ ఇండస్ట్రీ పై లేనన్ని విమర్శలు బాలీవుడ్ ఇండస్ట్రీ పై వినిపిస్తుంటాయి. అందులోనూ బాలీవుడ్ స్టార్లే ఎక్కువగా వారి ఇండస్ట్రీ పై వారే ఆరోపణలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇవి నిజానికి షాకింగ్ ఉన్నా అవే నిజమని చెబుతుంటారు చాలామంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో  కాస్టింగ్ కౌచ్ ఎక్కువని అక్కడ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఎదుగుతుంటే వారిని అణగదొక్కడమే అక్కడ పాతుకుపోయిన స్టార్ల పని అని, సామాన్యులకు అసలు ఎంట్రీ దొరకడం గగనం అని, ఒకవేళ వచ్చి హిట్ అందుకున్న వారికి రాకుండా  చేస్తారని ఇలా చాలా చాలానే ఉన్నాయి. కంగనా రనౌత్ వంటి స్టార్ హీరోయిన్ కూడా ఇలా  సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆరోపించడం వంటివి చాలానే విన్నాం.  

అయితే తాజాగా మరో బాలీవుడ్ హీరో కూడా ఇదే నిజం అంటున్నారు. ఇక్కడ సామాన్యులు ఎదుగుతుంటే కాళ్ళు పట్టుకుని లాగుతారని , వారిని తొక్కుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీపై స్పందించిన గోవింద షాకింగ్ ఇలా కామెంట్స్ చేయడం తో అంతా అవాక్ అయ్యారు. ఇక్కడ కిందకు లాగే వారే ఎక్కువగా ఉన్నారని వాపోయారు ఈ హీరో.  బాలీవుడ్ పరిశ్రమ మొత్తం తనకు వ్యతిరేకంగా ఎందుకు మారిందన్న ప్రశ్నకు గోవిందా ఇలా రియాక్ట్ అయ్యారు. 'ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అవుతావో, అప్పుడు నిన్ను కిందకు లాగేందుకు రెడీగా చాలామందే ఉంటారు. వారందరికీ నువ్వే మొదటి టార్గెట్... అని గోవింద చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాను అన్‌ప్రొఫెషనల్‌గా ఉంటున్నానంటూ ఇండస్ట్రీ ఆరోపించడం లో నిజం ఉందా అంటూ వ్యాఖ్యలు చేశారు.  
'దాదాపు 14-15 ఏళ్ల పాటు నేను ఫుల్ స్వింగ్ లో ఉన్నాను. అపుడు అన్నీ నాకు అనుకూలంగా ఉన్న టైం లో  ఎపుడు ఏ ఒక్కరూ నాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు . కానీ నాకు అవకాశాలు ఏమని తగ్గాయో కానీ అప్పటి నుంచి అన్ని నాకు వ్యతిరేకంగా మారాయి. ఇండస్ట్రీలో చాలామంది నాకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ టైంతో పాటు మారిపోతుంటారు' అంతే వారి మనసులో భావాలు కూడా అంతే ఈజీగా చేంజ్ అవుతాయి అని సీనియర్ నటుడు గోవింద అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: