మహేష్ తో పోటీకి దిగి చతికల పడ్డ చిరు.. ఎప్పుడంటే?

Purushottham Vinay
మెగాస్టార్ చిరంజీవి మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్టాలిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక ప్లాప్గా నిలిచిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాల్సిన ఈ సినిమా అప్పటికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ పోకిరి సునామీకి తట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.స్టాలిన్ సినిమా ఎంతో అద్భుతమైన కథతో తెరకెక్కింది. మెగా అభిమానులకు ఈ సినిమా అసలు ఎంతగానో నచ్చేసింది. ఈ సినిమా పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.2006 వ సంవత్సరం సెప్టెంబర్ నెల 20వ తేదీన స్టాలిన్ సినిమా విడుదలైంది. ఠాగూర్ సినిమా సక్సెస్ వల్లే మురుగదాస్ కు మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు. మురుగదాస్ తమిళంలో తెరకెక్కించిన రమణ సినిమాకు ఠాగూర్ సినిమా రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క స్పెషల్ సాంగ్ చేయగా ఆ సాంగ్ కూడా బాగా హిట్టైంది. 320 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.ఆ సమయంలో యూఎస్ లో ఒక వ్యక్తి ఇండియన్ కరెన్సీ ప్రకారం 50,000 రూపాయలు ఖర్చు చేసి ఈ సినిమా టికెట్ ను కొనుగోలు చేయడం అప్పట్లో సెన్సేషన్ అయింది. 


సినిమా తొలి టికెట్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి అభిమాని ఒకరు ఇంత మొత్తం ఖర్చు చేశారు. సినిమాలో కొన్ని సీన్స్ అయితే హైలెట్ గా ఉన్నాయి. భారీ అంచనాల వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయిందని కామెంట్లు కూడా వినిపించాయి. పైగా అప్పుడు పోకిరి హవా అసలు మాములుగా లేదు. పోటీగా ఎన్ని సినిమాలు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ సినిమా ముందు నిలబడలేకపోయాయి. ఇక చిరంజీవి త్రిష జోడీకి కూడా అప్పట్లో నెగిటివ్ మార్కులు పడ్డాయి.ముగ్గురికి సాయం చేయడమనే అద్భుతమైన కాన్సెప్ట్ గా ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేదు. కేవలం ఈ సినిమా 34 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.ఇంకా ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూస్తే ఈ సినిమాకు 4 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అయితే ఈ సినిమా టీవీలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.మహేష్ బాబు పోకిరిని టార్గెట్ గా చేసుకోని రిలీజ్ అయిన ఈ సినిమా దాని తాకిడికి తట్టుకోలేక ప్లాప్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: