కృష్ణ: హీరోగా పనికిరావు అనడానికి గల కారణం..?

Divya
తెరపైకి వీరోచితమైన కార్యక్రమాలను చేసే వాళ్లని హీరోలని పిలుస్తూ ఉంటారు. అదే బయట అయితే విరోచిత నిర్ణయాలు తీసుకొని ధైర్యంగా ముందుకు వెళ్లే వారిని హీరోలను కూడా పిలుస్తారు. అలా చూసుకుంటే తెరపైనే కాదు బయట కూడా సూపర్ స్టార్ కృష్ణ. తేనె మనసులు చిత్రం ద్వారా కృష్ణ లో పలు మార్పులు కనిపించాయి తనని తాను మార్చుకుంటూ అభిమానుల హృదయాలను గెలుచుకుని దూసుకెళ్లారు. లుక్ పరంగా నటన పరంగా ఆయన ఎప్పటికప్పుడు బెస్ట్ ఫార్మేషన్ చూపిస్తూ ఉండేవారు.

ఏఎన్ఆర్, ఎన్టీఆర్, శోభన్ బాబు వంటి హీరోలు వారి దారిలో వారు ముందుకు వెళుతుంటే జేమ్స్ బాండ్ సినిమాను తెలుగు సినిమా గా పరిచయం చేశారు కృష్ణ. ఆ తర్వాత 70MM మూవీ ఫస్ట్ సినిమా స్కోప్ ను కూడా టాలీవుడ్కు పరిచయం చేసింది కృష్ణనే. పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై భారీ చిత్రాలను తెరకెక్కించారు ఈయన. ఒక ఏడాది లోనే అత్యధిక చిత్రాలలో నటించి గొప్ప కథానాయకుడిగా రికార్డు సృష్టించారు అలాంటి కృష్ణ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈనెల 31 కృష్ణ పుట్టినరోజు సందర్భంగా కూతురు మంజుల తన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం చాలా వైరల్ అవుతోంది.

కృష్ణ మాట్లాడుతూ తనకు ఈ కలర్ భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ చదువు అయిపోయిన తర్వాత తను ఏ ఉద్యోగం చేయలేదని.. నేను ఇంట్లొ హీరోగా అవుతానని ఇంట్లో వాళ్ళతో చెప్పేవాడిని అనుకున్నట్టుగానే హీరో అయ్యాను అని తెలిపారు. గూడచారి 116 సినిమాకి తను తీసుకొని నాకు అడ్వాన్స్ ఇచ్చిన మొత్తం రూ.1000  రూపాయలట. కృష్ణ కి తన పిల్లలంటే ఇష్టం అందుచేత ఎక్కువగా ఫ్యామిలీని వదలకుండా ఉంటానని తెలిపారు. ఇక మంజుల ని హీరోయిన్ గా చేద్దామనుకుంటే ఆంధ్రప్రదేశ్లో అభిమానులు చాలా గొడవ చేశారని అందువల్లే చేయలేదని తెలిపారు. మహేష్ హీరోగా చేద్దామనుకున్నది ముందుగా ప్లాన్ ప్రకారం చేసింది కాదు ఒకసారి షూటింగ్ చూడటానికి వచ్చి షూటింగ్ జరుగుతుంటే దూరంగా కూర్చుని చే
చుస్తున్నాడు నువ్వు చేస్తావా లేదా అని అడిగితే నేను చేయను అంటూ స్టూడియో మొత్తం పరిగెత్తించాడట.
ఒకానొక సమయంలో 12 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి దాంతో తనని హీరోగా పనికిరావని ఎవరు మాట్లాడించే వారు కాదట దాంతో తన సొంత బ్యానర్లోనే బడిపంతులు సినిమా తీయడంతో మళ్లీ హీరోగా నిలదొక్కుకుననని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: