క్యాష్ షోలో.. సమీర్ ను గెట్ ఔట్ అంటు రెచ్చిపోయిన సుమా?

praveen
ప్రస్తుతం బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతుంది సుమా. దశాబ్ద కాలం నుంచి మకుటం లేని మహారాణిగా కొనసాగుతోంది. సుమా తర్వాత ఎంతో మంది యాంకర్లు వచ్చారు పోయారు కానీ సినిమా మాత్రం నిలదొక్కుకుని నిలబడింది. తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులందరినీ కూడా కట్టిపడేసింది. ఎలాంటి వల్గారిటీ లేకుండా గలగలా మాట్లాడుతూ అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. ఇక స్పాంటేనియస్ పంచులతో అందరినీ కడుపుబ్బ నవ్వించింది. ఇంత చేసిన తర్వాత సుమాను అభినందించకుండా ఎవరు ఉంటారు. బుల్లితెర ప్రేక్షకులు అందరూ ఫ్యాన్స్ గా మారిపోయారు.

 ఇటీవలే వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చి జయమ్మ పంచాయతీ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో సుమ నటిగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ టీవీలో ప్రసారమయ్యే క్యాష్ కార్యక్రమానికి సుమ యాంకరింగ్ చేస్తోంది. ఈ షోలో భాగంగా ప్రతివారం నలుగురు గెస్ట్ లను పిలుస్తూ ఇక వారితో ఫన్నీ టాస్క్ ఆడిస్తూ ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇటీవలే విడుదలైన క్యాష్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 క్యాష్ ప్రోమో చూసుకుంటే బండ్ల గణేష్, జోష్ రవి, సమీర్, వెంకట్ గెస్ట్ లుగా వచ్చారు. ప్రోమోలో భాగంగా ఒక ఇంటర్వ్యూ లాగా సుమ అందరిని కూర్చోబెట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. సమీర్ ఏదో సమాధానం చెప్తే సమీర్ గెటవుట్.. అంటూ ఎంతో సమయం సీరియస్ అవుతాడు.  ఇక్కడి నుంచి వెళ్ళిపో గెటవుట్ అంటుంది  సుమా. దీంతో షాక్ అయిన సమీర్ ఏంటండీ షోకి పిలిచి ఇలా అవమానిస్తారా అంటు చెబుతాడు.  ఇక ఆ తర్వాత బండ్ల గణేష్ కలుగజేసుకుని మీరు ఏమైనా రామోజీరావు అనుకుంటున్నారా అంటు పంచ్ వేయడంతో అందరు నవ్వుకుంటారూ. ఆ తర్వాత అర్థమవుతుంది మొన్నటికి మొన్న విశ్వక్ సేన్ విషయంలో జరిగింది ఇక ఇప్పుడు స్పూఫ్ చేశారని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: