అవకాశాల కోసం హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తారు : టాలీవుడ్ డైరెక్టర్
ఇటీవలే క్యాస్టింగ్ కౌచ్ గురించి ఒక టాలీవుడ్ దర్శకుడు స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పటివరకు సంకీర్తన, కీచురాళ్ళు, కోకిల లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ గీతాకృష్ణ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవలి కాలంలో అటు యూట్యూబ్ చానళ్లకు వరుసగా ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి దర్శకుడు గీతాకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చాడు.
ఆఫర్ల కోసం ఎంతో మంది హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తారని అలా అయితేనే అవకాశాలు వస్తాయని షాకింగ్ కామెంట్స్ చేశాడు. హీరోయిన్ లకు మాత్రమే కాదు సింగర్స్ విషయంలో కూడా ఇది జరుగుతుందని బాంబు పేల్చాడు దర్శకుడు గీతాకృష్ణ. తాను అందరిని అనడం లేదని ఇలాంటివీ వద్దు అనుకునేవాళ్ళు 10 నుంచి 15 శాతం మంది ఉంటారంటూ గీతాకృష్ణ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఈ దర్శకుడు ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి..