యు ట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి సినిమాలో యంగ్ హీరో అతిధి పాత్ర?

VAMSI
ఒకే ఒక్క సంఘటనతో యు ట్యూబ్ లో ఫ్రాంక్ వీడియోలు చేసుకునే ఒక టీనేజర్ బాగా ఫేమస్ అయిపోయాడు. ఈ వివాదానికి కారణం అయిన యు ట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మరియు కరాటే కళ్యాణిలు ఇంత హ్నగమా జరుగుతుందని కనీసం ఊహించి ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ ఎక్కువగా నష్టపోతోంది అయితే కళ్యాణి అని చెప్పాలి. కానీ ఈ వివాదంతో శ్రీకాంత్ రెడ్డి లైఫ్ టర్న్ అయిందని చెప్పాలి. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ఫ్రాంక్ వీడియోల ద్వారా అతను బాగానే సంపాదించాడని తెలుస్తోంది. ఎందుకంటే అతను చెప్పిన దానిని బట్టి త్వరలోనే ఒక సినిమాలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఈ సినిమా టైటిల్ ను కూడా శ్రీకాంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ ద్వారా బయట పెట్టారు. కొత్తపేట గ్రామం అనే సరికొత్త టైటిల్ ను రిజిస్టర్ చేయించారట. ఈ వివాదానికి ముందే సినిమా పనుల్లో శ్రీకాంత్ ఉన్నాడు. కానీ సరిగ్గా ఇదే టైం కు ఇలా జరగడం తనకు బాగా ప్లస్ అయిందని చెప్పాలి. అందుకే సినిమా గురించి ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు అడగకపోయినా నేను ఫలానా సినిమా చేస్తున్నాను అని వివరాలన్నీ తెలుపుతూ సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఐటెం సాంగ్ చేస్తోందట.
ఇక టాలీవుడ్ లో ఫేమస్ లిరిక్ రైటర్ లు అయిన చంద్రబోస్ మరియు కాసర్ల శ్యామ్ లు సినిమా కోసం పాటలు రాసినట్లు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. ఇక ఇందులో మిగిలిన తారాగణం ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్రలో ఒక యంగ్ హీరో చేయనున్నాడు అని తెలుస్తోంది. ఈ వారం రోజులలో తన పరిస్థితి గమనించిన ఒక హీరో తనకు మద్దతుగా నిలిచాడట. అందుకని ఏమాత్రం పారితోషికం తీసుకోకుండా ఇందులో నటించనున్నాడని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: