SSMB 28 : సూపర్ స్టార్ కి తమ్ముడిగా బ్లాక్ బస్టర్ హీరో!

Purushottham Vinay
సూపర్ స్టార్ మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించి ప్రారంభించారు. ఇందులో సూపర్ స్టార్ మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. ఖలేజా లాంటి విభిన్నమైన సినిమాల తరువాత వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ అల.. వైకుంఠపురములో లాంటి బాక్సాఫీస్ హిట్ తరువాత చేస్తున్న సినిమా కాబట్టి బడ్జెట్ లెక్కలు కూడా గట్టిగానే పెరిగాయి. భీంలా నాయక్ సినిమాకి హెల్ప్ చేసినా కానీ పూర్తి స్థాయి డైరెక్టర్ గా అల.. వైకుంఠపురములో తరువాత తెరకెక్కిస్తున్న సినిమా ఇదే.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట్లో హల్చల్ చేస్తుంది.


ఈ సినిమాలో గత కొంత కాలం నుంచి మరో హీరో కూడా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయని వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. అందుకే ఆ విషయం ఆల్ మోస్ట్ ఫైనల్ కి తెచ్చేసిన్నట్లు ఉన్నారు మేకర్స్. ఇండస్ట్రీలో నడుస్తున్న సమాచారం ప్రకారం ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లో మరో హీరోగా లెటేస్ట్ సెన్సేషన్ సిద్ధు జొన్నలగడ్డ పేరు ఇప్పుడు పెద్ద ఎత్తున బాగా వైరల్ అవుతుంది.డీజే టిల్లులో అతని బాడీ లాంగ్వేజ్ చూశాక ఈ సినిమాలో మహేశ్ బ్రదర్ రోల్ కి బాగా మ్యాచ్ అవుతుందని..అల్లరి చిల్లరిగా ఉండే స్టైల్ కి సిద్ధు బాగా కరెక్ట్ గా ఉంటాడని..అందుకే ఈ పాత్రకు అతన్ని ఫిక్స్ చేశారట మేకర్స్. అయితే ఇక దీనిపై మాత్రం ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక  హారికా & హాసిని వారు భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ స్కేల్ లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రికార్డులు సృష్టిస్తున్నాడు మహేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: