సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి గుడ్ బై ?

VAMSI
టాలీవుడ్ లో మూడు దశాబ్దాలుగా మెగాస్టార్ గా ఉంటూ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు చిరంజీవి. అయితే మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుని రాజకీయాల్లోకి వెళ్ళాడు. కానీ అక్కడ తనకు అంత మంచి అనుభవం అయితే ఎదురవలేదు అని చెప్పాలి. అందుకే మళ్లీ సినిమాల్లోకి వచ్చి వరుస సినిమాల్ని చేస్తూ వెళుతున్నాడు. 60 వ సంవత్సరంలో కూడా తన నటనతో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి మరియు ఆచార్య లాంటి సినిమాలను ప్రేక్షకుల ముందు తీసుకు వచ్చాడు. అయితే ఈ మూడు సినిమాలలో ఒక్క ఖైదీ మినహాయించి మరేదీ కనీసం మెగా ఫ్యాన్స్ ను కూడా ఆకట్టుకోవడంలో విఫలం అయింది. దీనితో చిరంజీవి ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ పడుతున్నారు.
ముఖ్యంగా రామ్ చరణ్ తేజ్ మరియు చిరు ల కాంబినేషన్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమా మరీ దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. అంతే కాకుండా ఇందులో కథ, కథనం కూడా నెమ్మదిగా సాగడం... చిరంజీవికి హీరోయిన్ లేకుండా చేయడం, మునుపటి హుషారు చిరంజీవిలో లేకపోవడం వంటి కారణాలు సినిమా ఫెయిల్ కావడానికి కారణాలు అని తెలుస్తున్నా ? తెరవెనుక చాలా విషయాలు జరిగాయని తెలుస్తోంది. అయితే ఇప్పుడు చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలు గాడ్ ఫాదర్, భోళా శంకర్ మరియు ఇంకొకటి పేరు ఇంకా ఫిక్స్ చేయలేదు.
ఈ సినిమాల విషయంలో అయినా సదరు డైరెక్టర్లు తెలుగు ప్రేక్షకులను, ప్రెజెంటర్ ట్రెండ్ ను దృష్టిలో పెట్టుకుని చేయకపోతే... ఆచార్య లాంటి ఫలితాల్ని రుచి చూసే ప్రమాదం లేకపోలేదు. ఇది ఇలాగే కొనసాగితే చిరంజీవి అతి త్వరలోనే సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పే ఛాన్స్ లు మెండుగా ఉన్నాయి. మరి ఏమి జరుగుతుంది అనేది తెలియాలంటే ఈ సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఆగాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: