సోషల్ మీడియా కు షాకిచ్చిన శిల్పా శెట్టి.. కారణం ఏమిటంటే..!!

Divya
బాలీవుడ్, టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించిన హీరోయిన్లలో శిల్పాశెట్టి కూడా ఒకరు. ఇక సోషల్ మీడియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తరచూ తనకి సంబంధించిన విషయాలను కూడా పోస్టు చేస్తూ ఉంటుంది శిల్పాశెట్టి. దీంతో ఈమె కు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అని చెప్పవచ్చు. అలాగే తనకు సంబంధించిన ఫిట్నెస్ విషయాల గురించి తరచూ తెలియజేస్తూ ఉంటుంది అభిమానులకు. ఇంతటి క్రేజ్ కలిగిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా సోషల్ మీడియా కు బ్రేక్ ఇవ్వడంతో ఆమె అభిమానులు సైతం షాక్ కు గురయ్యారు.
ఈ విషయాన్ని స్వయంగా శిల్పాశెట్టి తన ట్విట్టర్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి పోస్ట్ చేయడం జరిగింది. శిల్పా శెట్టి పోస్ట్ చేస్తూ.. ఏకాభిప్రాయాలతో చాలా విసుగు చెంది ఎటుచూసినా ఒకేలా కనిపిస్తోంది.. నాకు కొత్తదనం గా ఫీల్ అయ్యే అంతవరకు సోషల్ మీడియా కి దూరంగానే ఉంటానని తెలియజేసింది శిల్పాశెట్టి. దీంతో ఈమె అభిమానులు సైతం అప్సెట్ అయ్యారు. అయితే ఇప్పటికే శిల్పాశెట్టికి ట్విట్టర్లో..6.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక వీటితో పాటుగా ఇంస్టాగ్రామ్ 25.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

దీంతో మొత్తం మీద శిల్పా శెట్టి కి 32 మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించుకుంది అని చెప్పవచ్చు.ఇక సోషల్ మీడియాకు గుడ్బై చెబుతున్న సందర్భంలో  ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా తెలియజేసినట్లు గా సమాచారం. మేము ఎల్లప్పుడూ ప్రత్యేకమైన వారము కాబట్టి ఇతర విషయాలలో అసలు జోక్యం చేసుకోము.. మన సొంత వ్యక్తిత్వాలలో కూడా కొంతమంది మంచి, చెడు జరుగుతూనే ఉంటుంది. అందుచేతనే ప్రతిరోజు మన మళ్ళీ మనం కొత్తగా తీర్చిదిద్దుకుందాం అంటూ ఒక నోట్ ద్వారా తెలియజేసింది శిల్పా శెట్టి. ఇక గత సంవత్సరం కూడా శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కూడా సోషల్ మీడియా కు దూరం కావడం జరిగింది అంటూ ఈ సారి షాక్ ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: