మహేష్ బాబు నో చెప్పిన.. హిట్ సినిమాల లిస్టు ఇదే?

praveen
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన కథను మరో హీరో చేయటం సూపర్హిట్ అందుకోవడం లాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు కథ నచ్చక మరికొన్నిసార్లు డేట్లు అడ్జస్ట్ కాక చివరికి సినిమాను దూరం చేసుకుంటూ ఉంటారు ఎంతో మంది స్టార్లు. అచ్చం ఇలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎన్నో సినిమాలను వదిలేసుకున్నారు. ఇలా మహేష్ బాబు వదిలేసుకున్న ఎన్నో సినిమాలు సూపర్ హిట్ సాధించాయి.  మరి మహేష్ బాబు వదిలేసిన హిట్ సినిమా లిస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం.
 పుష్ప : టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అయితే ముందుగా ఈ సినిమా కోసం మహేష్ బాబు ని సంప్రదించారట సుకుమార్. కానీ మహేష్ బాబు మాస్ లుక్ సెట్ కాదని నో చెప్పారట.
 గజిని : సూర్య హీరోగా నటించిన గజిని సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమాను ముందుగా మహేష్ బాబుతో చేయాలని అనుకున్నారట. కానీ మహేష్ అప్పటికే వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో చివరికి నో చెప్పారట.
 వర్షం : ప్రభాస్ కి ఒక్కసారిగా మాస్ ఫాలోయింగ్ తీసుకు వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రం వర్షం. ఈ సినిమాలో ముందుగా మహేష్ బాబు ను అనుకున్నారు. కానీ ఆ తర్వాత మహేష్ బాబు డేట్లు ఖాళీ లేకపోవడంతో ప్రభాస్తో తీశారట.
 ఏ మాయ చేసావే  : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ యూత్ ఫేవరెట్ మూవీ గా ఉండే చిత్రం ఏ మాయ చేసావే. ఈ సినిమాలో నాగచైతన్య కు బదులు ముందుగా మహేష్ బాబు ని అనుకున్నారట. ఇప్పటికీ వేరే సినిమాతో బిజీగా ఉండడంతో నో చెప్పాడట మహేష్ బాబు.
 అఆ : త్రివిక్రమ్ కాంబినేషన్లో నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా కోసం ముందుగా హీరో మహేష్ బాబు ని సంప్రదించారట. కానీ ఏమైందో మహేష్ మాత్రం నో చెప్పాడట.
 24 : సూర్య త్రిపాత్రాభినయం చేసిన చిత్రం 24. వినూత్నమైన  కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా చేయడానికి మహేష్ అంత రిస్క్ తీసుకోలేదు.  అందుకే నో చెప్పేశాడట.

 లీడర్ : దగ్గుబాటి రానా హీరోగా ఎంట్రీ ఇచ్చిన లీడర్ సినిమాను ముందుగా మహేష్ బాబు తో తీయాలని అనుకున్నారు శేఖర్ కమ్ముల.  కానీ మహేష్ బాబు అప్పటికే బిజీగా ఉన్న నేపథ్యంలో డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఇక లేట్ చేయకుండా రానాతో తీశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: