ఆకట్టుకుంటున్న' శ్రీదేవి శోభన్ బాబు ' ట్రైలర్..
పేపర్ బాయ్, ఏక్ మినీకథ' లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ కుర్రాడు తాజాగా నటిస్తున్న చిత్రం 'శ్రీదేవి శోభన్‌బాబు'..ఈ సినిమా షూటింగ్ పనులను బిజీగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత నిర్మిస్తున్నారు.గోల్డ్‌బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాతో ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. '96, జాను' చిత్రాల్లో కథానాయికల చిన్నప్పటి పాత్రను పోషించిన గౌరీ కృష్ణన్ ఈ సినిమాతో టాలీవుడ్‌కు కథానాయికగా ఎంట్రీ ఇవ్వనుంది.
ఈ సినిమా లవ్, కామెడీ, ఎమొషనల్ సన్నీవేశాలతో తెరకెక్కుతుంది.మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తూన్నారు.ఈ సినిమా ట్రైలర్ ను చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.హీరోకి నోటివాటమెక్కువ, హీరోయిన్‌కు చేతివాటమెక్కువ అంటూ పాత్రలను పరిచయం చేయడం బాగుంది. సంతోష్ శోభన్ యాక్టింగ్, గౌరీ అల్లరి ప్లస్ గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు. గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.ట్రైలర్ మొత్తం జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.. ఈ సినిమా విడుదల తెదిని త్వరలో ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నారు.