హీరోయిన్ బిందు మాధవికి.. యువ హీరో సపోర్టు.. కారణం..!!

Divya
తెలుగులో బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లో హీరోయిన్ బిందు మాధవి తన హవా కొనసాగిస్తోంది అని చెప్పవచ్చు.. గతంలో ఆమె రన్నర్ గా నిలిచిన అఖిల్ కు మాత్రం చుక్కలు చూపించింది. అఖిల్ తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా గేమ్ ఆడుతూ ముందుకు సాగుతూ ఉండేది. దీంతో ఆమె ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఇటీవల ఎపిసోడ్లు బిందు మాధవి మాట్లాడుతూ తాను లవ్ ఫెయిల్యూర్ అయ్యాను అంటూ ప్రకటించిన విషయం అందరికి తెలిసినదే. హీరోయిన్ బిందు మాధవి తెలుగులో కంటే తమిళంలోనే మంచి చిత్రాలలో నటించి ఘన విజయాలను అందుకుంది.
ఇక అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ. అందుకే తమిళం లో కూడా  బిగ్ బాస్ లో పాల్గొని ఇప్పుడు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. తమిళ ,తెలుగు బిగ్ బాస్ లో కనిపించే బిందు మాధురి ఈ సారి బిగ్ బాస్ విజేతగా నిలిచే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. దీంతో ఆమె అభిమానులు కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేస్తున్నారు.
బిందు మాధవి కి తమిళ యువ హీరో హరీష్ కళ్యాణ్ మద్దతుగా తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ చేయడం జరిగింది. బిందుమాధవి తప్పకుండా విజయం సాధిస్తుందని తెలియజేశారు. ఆమెకు ఓట్లు వేయండి అని ఈ యువహీరో కోరడంతో ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నటిగా ఎన్నో చిత్రాలలో నటించిన బిందు మాధవి తెలుగులో బిగ్ బాస్ లో మొదటి స్థానంలో నిలుస్తుందని హరీష్ కళ్యాణ్ నమ్మకంగా ఉన్నారు. ఈ యువ హీరో బిందుమాధవి కంటే చాలా చిన్న వాడు. మరి ఈ యువ హీరో ఈమెకు సపోర్ట్ చేయడం వెనక వీరిద్దరి మధ్య ఏదో అంటూ సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: