ఆ హీరో మొట్ట మొదటి సంపాదన ఎంతో తెలుసా..?

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా, నిర్మాతగా, బిజినెస్మేన్ మెన్ గా మంచి ప్రేక్షకాదరణ పొందారు అలనాటి నటుడు మురళీ మోహన్. మురళీమోహన్ ఎంచుకున్న దారి ఏదైనా సరే సక్సెస్ కావడానికి చాలా కష్టపడుతూ ఉంటారు ఆయన. ఇక తను ఇంటర్ చదివిన తర్వాత విజయవాడలో ఒక చిన్నపాటి షాపులో పని చేసి తన జీవితాన్ని ప్రారంభించారు ఈయన. ఇక మురళీమోహన్ వివాహమైన తర్వాత బిజినెస్ వైపు దృష్టి పెట్టడం జరిగింది. ఇక అలాంటి సమయంలోనే ఆయనకు సినిమా అవకాశాలు రావడం జరిగింది. ఇక సినిమాలలో సక్సెస్ అయితే బిజినెస్ ని వదిలేద్దాం అనుకున్నారు. అలాగే సినిమాల్లో సక్సెస్ అవడంతో మురళీమోహన్ బిజినెస్ వైపు నుంచి సినీ ఇండస్ట్రీ వైపు ఎక్కువ మొగ్గు చూపారు.

అయితే మురళీమోహన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక తన భార్య ప్రోత్సాహం కూడా ఉందని ఆయన పలు సార్లు తెలియజేశారు. సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఒక కామెంట్ ఫ్రెండ్ గా.. అలనాటి హీరో శోభన్ బాబుని కలిశానని తనని కూడా సినిమాలలోకి వచ్చేయమని చెప్పడంతో మురళీ మోహన్ కి కూడా తన మీద తనకి నమ్మకం ఏర్పడి సినిమాల్లోకి వచ్చానని తెలియజేశారు. అలా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత దాసరి గారు తన కి అండగా నిలిచారని తెలియజేశారు.
తను నటుడిగా ఈ రోజు ఈ స్థానంలో ఉండటానికి ముఖ్య కారణం ఆయనే అని తెలియజేశారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో దూరం ప్రయాణించానని మురళీ మోహన్ తెలిపారు. ఇక తన సొంత బ్యానర్లోనే ఎన్నో సినిమాలను నిర్మించి మంచి విజయాలను కూడా అందుకున్నారు. రియల్ ఎస్టేట్ పరంగా కూడా తనని తాను నిరూపించుకున్నాడు మురళీమోహన్. సినీ ఇండస్ట్రీ లోకి రాక ముందు మొదట మోటార్ల షాప్ లో 200 రూపాయల కి పనిచేశారట. అదే తన మొదటి జీతం అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: