బర్తడే :రష్మిక సినీ జీవితం ఎంట్రీ ఎలా..?

Divya
రష్మిక పూర్తి పేరు రష్మిక మందన.. ఈమె కర్ణాటకలోని కోడగుజ్ జిల్లాలోని వీరాజ్ పేట గ్రామంలో సుమా, మదన్ దంపతులకు.. ఏప్రిల్ 5 1996 న మొదటి సంతానంగా జన్మించింది. ఇక తన తండ్రి సుమన్ కూడా వ్యాపారవేత్త. తన తల్లి గృహిణి.. ఆమె చదువు విషయానికి వస్తే.. కార్గో పబ్లిక్ స్కూల్లో పదో తరగతి వరకు చదివింది. ఇక ఆ తర్వాత రామయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది.. ఇక మైసూర్లో జర్నలిజం చేసి ఆ తర్వాత పట్టా పొందింది.

ఇక ఆ తర్వాత తన చిన్న వయసులో నుంచి ఏదైనా స్కూల్ ఫంక్షన్ లలో సాంస్కృతిక పార్టీలలో నాట్యం చేస్తూ ఉండేది. 2014 వ సంవత్సరంలో బెంగళూరులో నిర్వహించిన టైమ్స్ పత్రిక నిర్వహించిన వాటిలో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా పేరు పొందింది. 2017 వ సంవత్సరం లో మొదటి స్థానం లభించింది. ఇక కిరాక్ పార్టీ చిత్రం తెరకెక్కిస్తున్న సమయంలోనే నటుడు రక్షిత సెట్టీ తో పరిచయం అయింది. ఇక వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఎంతో కాలం పాటు వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు.
ఆ తర్వాత కుటుంబ సమక్షంలో జులై 3 2017 లో రష్మిక-రక్షిత లకు నిశ్చితార్థం జరిగింది. అయితే వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అనే విషయం ఇప్పటికీ తెలియడం లేదు. రష్మిక జర్నలిజం చదువుతున్న సమయంలో తన స్నేహితులతో కలిసి 2010 లో మోడలింగ్ ప్రారంభించింది. ఇక అదే సంవత్సరంలో క్లీన్ అండ్ క్లియర్ బ్రాండ్ కు అంబాసిడర్ గా మారింది. ఇక ఆ తర్వాత కిరాక్ చిత్రంలో అవకాశం వచ్చిందట మొదట తన తల్లితండ్రులు సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదట. ఇక ఆ తర్వాత తన తల్లిదండ్రులను ఒప్పించి.. 2016 సంవత్సరంలో కిరాక్ పార్టీ తమిళ చిత్రంలో నటించింది. ఈ సినిమాలో ప్రేక్షకులను బాగా అలరించింది. ఆ తర్వాత పునీత్ రాజ్ తో కూడా ఓ సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత చమక్ అనే చిత్రంలో హీరో గణేష్ సరసన నటించింది. ఇక 2018లో వెంకీ డైరెక్షన్లో నాగశౌర్య హీరోగా చలో సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత గీత గోవిందం, దేవదాస్, సరిలేరు నీకెవ్వరు, డియర్ కామ్రేడ్, పుష్ప తదితర చిత్రాలతో బాగా పేరు పొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: