ప్రభాస్ సినిమా ప్లాప్ అని ఫస్ట్ డే నే చెప్పేసా... దిల్ రాజు..!

Pulgam Srinivas
సినిమా విడుదలైన రోజే సినిమాలో నటించిన హీరో కు మీరు నటించిన సినిమా ఫ్లాప్ అని చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి,  అదే నేరుగా వెళ్లి చెప్పాలంటే మరింత ధైర్యం కావాలి,  అలా ప్రభాస్ నటించిన సినిమా విషయంలో దిల్ రాజు నేరుగా వెళ్లి ప్రభాస్ నటించిన సినిమా ఫ్లాప్ అని చెప్పాడట. అసలు ఏ సినిమా విషయంలో దిల్ రాజు అలా చేశాడో తెలుసుకుందాం...  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇలియానా హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన సినిమా మున్నా,  ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టిందనే విషయం దిల్ రాజుకు మొదటి రోజు, మొదటి ఆటకే తెలిసిపోయిందట, ఈ విషయాన్ని నేరుగా ప్రభాస్ దగ్గరకు వెళ్లి చెప్పేసానంటూ అప్పటి ఘటనను దిల్ రాజు గుర్తు చేసుకున్నాడు.


 మున్నా మూవీ స్క్రిప్ట్ దగ్గరే నాకు ఇబ్బంది అయింది, కానీ దర్శకుడు వంశీ పైడిపల్లి ఒప్పుకోలేదు. రైటర్ కొరటాల శివ కూడా మొన్న స్క్రిప్ట్ బాగుంది అని అన్నాడు, అక్కడ నేను కూడా తగ్గాను. దర్శకుడు వంశీ పైడిపల్లి ని నమ్మను, మొదటి రోజు రిలీజ్ షో చూశాను. నేరుగా ప్రభాస్ దగ్గరికి వెళ్లాను, ఆ సమయం లో ప్రభాస్, వాళ్ల ఫ్రెండ్స్ హిట్ కొట్టేశాం అనే ఆనందం లో ఉన్నారు. నేను ప్రభాస్ దగ్గరికి డైరెక్టు గా వెళ్లి సారీ చెప్పాను, హిట్ మూవీ లేకపోయాను అన్నాను. ప్రభాస్ ఫ్రెండ్స్ అంతా షాక్ అయ్యారు, ప్రభాస్ కూడా మూవీ బాగుందని వాదించాడు, నేను మాత్రం ఒప్పు కోలేదు. మున్నా మూవీ యావరేజ్ సినిమా అని చెప్పాను, మెంటల్లీ ప్రిపేర్ అవ్వమని చెప్పేశాను.  ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ ప్రభాస్  మూవీ 9 సెంటర్ లో 100 రోజులు ఆడింది అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: