పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈ మధ్య నే ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 25 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది, ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా మరో హీరోగా నటించాడు. ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 25 వ తేదీన థియేటర్ లలో విడుదలైన భీమ్లా నాయక్ మూవీ ప్రేక్షకుల నుండి మంచి టాక్ ను సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లను కూడా సాధించింది, ఇది ఇలా ఉంటే భీమ్లా నాయక్ సినిమా పనులన్నీ ముగించుకున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే హరిహర వీరమల్లు షూటింగ్ ను తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం కు పైగా పూర్తి అయ్యింది.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ మూవీ లో కూడా నటించడానికి ఇప్పటికే కమిట్ అయ్యి ఉన్నాడు, అలాగే పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక మూవీ లో నటించడానికి ఇప్పటికే కమిట్ అయి ఉన్నాడు. ఇలా ఇప్పటికే వరుస సినిమాలకు కమిట్ అయిన పవన్ కళ్యాణ్ తమిళ సినిమా వినోదయ సీతం మూవీ ని కూడా తెలుగు లో రీమేక్ చేయనున్నట్లు సమాచారం, ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది, ఇలా పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలో నటిస్తున్నాడు.