సాయి ధరమ్ తేజ్ వచ్చేది అప్పుడే..!!

P.Nishanth Kumar
బైక్ యాక్సిడెంట్ తర్వాత పూర్తిగా కోలుకుని సాయి తేజ్ మళ్లీ తన తదుపరి సినిమాలపై దృష్టి పెడుతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన చాలామందిలో చాలా ఫాస్ట్ గా మాస్ ఆడియన్స్ యొక్క ఆదరణను పొందారు. సాయి ధరమ్ తేజ్ డ్యాన్సులు ఫైట్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకనే ఈ హీరో ఎక్కడా స్లో అవకుండా  డౌన్ లేకుండా ముందుకు దూసుకుపోయాడు. ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకునే ఈ హీరో మరొక వైపు యూత్ ను కూడా భారీ స్థాయిలో ఆకర్షించాడు.

అలా ఆయన వరుస విజయాలు అందుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన నటించిన గత మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించాయి. ప్రతి రోజు పండగే సోలో బ్రతుకే సో బెటర్ రిపబ్లిక్ సినిమాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. అయితే బైక్ యాక్సిడెంట్ తర్వాత ఆయన తదుపరి సినిమాలను మొదలుపెట్టలేదు. కొంత విశ్రాంతి తీసుకున్న తరువాత త్వరలోనే ఆయన మిస్టరీ థ్రిల్లర్ సినిమాను మొదలు పెట్టబోతున్నట్లూ వార్తలు వినిపిస్తున్నాయి దీనికి కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు గా చెబుతున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ప్లే అందిస్తూ ఉండగా వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా విడుదల చేయబోతున్నారు.  ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ రీమేక్ సినిమాలో నటించబోతున్నాడు సాయి తేజ్ తమిళంలోనీ వినిదీయ సిత్రం సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించగా తెలుగులో కూడా ఆయన దర్శకత్వం వహించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ భారీ కలెక్షన్ల వర్షం కురిపించింది. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమాను పవన్ కి చూపించగా దీనిలో సాయి తో కలిసి నటించడానికి పవన్ ఒప్పుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: