శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా పెళ్లికి.. మొదటి భార్య ఎంట్రీ.. తర్వాత?

praveen
బాలీవుడ్ లో పెళ్లిళ్లు విడాకులు ఆ తర్వాత డేటింగ్లు లవ్ రిలేషన్ షిప్ లు సర్వ సాధారణం. పెళ్లి చేసుకోవడం నచ్చకపోతే విడాకులు తీసుకోవడం.. ఇక ఆ తర్వాత నచ్చిన వారితో డేటింగ్ చేయడం.. ఇంకా బాగా నచ్చితే ఇక రెండో పెళ్లి లేదా మూడో పెళ్లి చేసుకోవడం చేస్తూ ఉంటారు బాలీవుడ్ లో నటీనటులు. ఎన్నో రోజుల నుంచి బాలీవుడ్ లో ఇలాంటిది కాస్త ఎక్కువగానే కొనసాగుతూ వస్తుంది అని చెప్పాలి. అంతేకాదు ఒక భార్య ఉండగానే మరో మరో పెళ్లి చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు అచ్చం ఇలాగే హిందీ హీరోయిన్ శిల్పా శెట్టి పెళ్లి జరిగింది.

 బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది శిల్పాశెట్టి. ఇక ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ను పెళ్లి చేసుకుంది. అయితే ఈయనకు అప్పటికే పెళ్లి కావడం గమనార్హం. దీంతో శిల్పా శెట్టి రాజ్ కుంద్రా కి రెండవ భార్యగా మారిపోయింది. అయితే రాజ్ కుంద్రా మనస్పర్థల కారణంగా తన మొదటి భార్య నుంచి విడిపోయాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత శిల్పశెట్టి రాజ్కుంద్రా పెళ్లి ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుందట.

 ఏకంగా పెళ్లి సమయంలో రాజ్కుంద్రా మొదటి భార్య పెళ్లి వేడుకలో కి ఎంట్రీ ఇచ్చిందట. అయితే తనతో విడాకులు తీసుకున్న భార్య ఇక రెండవ పెళ్లి కి రావడంతో ఒక్కసారిగా రాజ్ కుంద్రా ఆశ్చర్యంలో మునిగిపోయారట. అంతలోనే ఊహించని షాక్.. తనతో అధికారికంగా విడాకులు రాకముందే రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి అని పెళ్లి ని అడ్డుకుందట మొదటి భార్య.. ఇలా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చెల్లదని చెప్పేసిందట. కానీ ఆ తర్వాత అధికారికంగా విడాకులు వచ్చాయి తెలిసాక ఇక యధావిధిగా వీరి పెళ్ళి జరిగిపోయింది. మొత్తంగా అయితే రాజ్ కుంద్రా శిల్ప శెట్టి పెళ్లి లో అతని మొదటి భార్య హంగామా చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: