రాధే శ్యామ్ : ఈ రాతలే సాంగ్ వింటేజ్ విజువల్స్ సూపర్!

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా 'రాధే శ్యామ్'. కరోనా వైరస్ మహమ్మారీ కారణంగా చాలా సార్లు వాయిదా పడుతూ వస్తున్న పెద్ద సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటని చెప్పాలి.ఇక ఎలాగోలా డేట్ సెట్ చేసుకొని మార్చి 11 వ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు ప్రకరించారు నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఇంకా అలాగే ప్రోమోలు అన్నీ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడమే కాకుండా ఈ సినిమా పై ఉన్న అంచనాల్ని ఫ్యాన్స్ కి మరింతగా పెంచాయనే చెప్పాలి.ఇక మళ్ళీ 'రాధే శ్యామ్' సినిమా ప్రమోషన్ల హడావిడిని మరింతగా పెంచారు 'రాధే శ్యామ్' మేకర్స్. వాలెంటైన్స్ డే రోజునాడు స్పెషల్ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే.


'రాధే శ్యామ్' సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచిన 'ఈ రాతలే' పాటకి సంబంధించిన వీడియో సాంగ్ ను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర బృందం. 2 నిమిషాల 19 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో సాంగ్ సూపర్ వింటేజ్ విజువల్స్ తో ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.'రాధే శ్యామ్' స్టోరీ అనేది ఓ మేజికల్ లవ్ స్టోరీ అని ట్రైలర్ ద్వారా అర్ధం అయ్యింది. విక్రమాదిత్య ఇంకా ప్రేరణలు ఒకర్నొకరు చూసుకోకుండానే ప్రేమించుకుంటారు. అది ఎలా అనేది సింపుల్ గా ఈ పాట ద్వారా చూపించారు. ఈ పాట చూడ్డానికి చాలా మంచి ఫీల్ ను కలిగిస్తుంది. మంచి వింటేజ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తున్న 'రాధే శ్యామ్' సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులను అయితే ఈ పాట తెగ ఊపిస్తుందనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ పాట కూడా మంచి చార్ట్ బస్టర్ హిట్ గా నిలవడం ఖాయం అంటున్నారు నెటిజన్స్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: