పాన్ ఇండియా సినిమాతో పోటీ పడబోతున్న సూర్య..!

Pulgam Srinivas
తమిళ స్టార్ హీరో సూర్య కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ మార్కెట్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు,  ఈ హీరో మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గజిని సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ను సంపాదించుకున్నాడు.  గజిని సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న సూర్య ఆ తర్వాత తాను నటించిన అనేక సినిమాలను తెలుగు లో డబ్ చేసి  విడుదల చేశాడు, ఇలా  సూర్య డబ్ చేసి విడుదల చేసిన సినిమాలలో అనేక సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి విజయాలను సాధించాయి.  సూర్య  నటించిన అనేక సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి,  ఇది ఇలా ఉంటే తాజాగా కూడా సూర్య నటించిన ఎతరుక్కుమ్ తునింధవన్  సినిమాను కూడా తమిళ తో పాటు తెలుగులో కూడా విడుదల చేయబోతున్నాడు.

 ఈ సినిమా మార్చి 10 వ తేదీన విడుదల కాబోతుంది,  ఈ సినిమా విడుదల అయిన మరుసటి రోజు మార్చి 11 వ తేదీన పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన రాదే శ్యామ్ సినిమా కూడా విడుదల కాబోతుంది,  ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించాడు, ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు,  ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి,  ఇలా పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ అంచనాలు నెలకొని ఉన్న రాదే శ్యామ్ సినిమా విడుదల కంటే ఒక్క రోజు ముందే సూర్య తన సినిమాను విడుదల చేయబోతున్నాడు, ఎతరుక్కుమ్ తునింధవన్ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించగా, ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు నిర్మించారు.  మరి  సూర్య 'ఎతరుక్కుమ్ తునింధవన్' ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో  తెలియాలి అంటే ఈ సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: